జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా సైనిక శిబిరంపై నవంబర్ 29న జరిగిన ఉగ్రదాడి వెనుక ముష్కరులు పక్కా ప్రణాళికే ఉంది. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది నాలుగు గంటల సేపు జరిపిన ఆపరేషన్‌లో ఈ ఉగ్ర ఘటనకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు.అయితే ఈ ప్రయత్నంలో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు సైనిక సిబ్బంది నేలకొరిగారు. ఈ ఘటనకు సంబంధించి అధికారుల గుర్తించిన ఆధారాల ప్రకారం....తొలుత ఉగ్రవాదులు సైలెన్సర్ గన్ ఉపయోగించి సెంట్రీని కాల్చి చంపారు. ఈ తరహాలో (సైలెన్సర్ కాల్పు) సైనిక శిబరంలో ఉగ్రవాదులు ప్రవేశించడం ఇదే మొదటిసారి.
ఆర్మీ యూనిట్ ప్రాంగణంలోకి సమీపించిన ఉగ్రవాదులు వెనుక వైపు నుంచి ఎలిఫాంట్ గ్రాస్ ద్వారా ప్రవేశ మార్గం వద్దకు వచ్చారు. అక్కడే ఉన్న సెంట్రీని సైలెన్సర్ బిగించిన తుపాకీతో కాల్చి చంపి లోపలకు అడుగుపెట్టారు. ఆ విషయం ఒకరు గుర్తించగానే ,ఆర్మీ సైనిక కుటుంబాలు ఉన్న రెండతస్తుల భవింతిలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్న దృశ్యం వారి కంటపడింది. ఆ కుటుంబాలను బందీలుగా పట్టుకునే అవకాశం ఉన్నట్టు గ్రహించిన ఆర్మీ దళాలు సైనిక కమెండోలతో కలిసి టెర్రరిస్టులపై విరుchuకుపడ్డారు. మరోవైపు క్యాంప్‌లో ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్‌లను కూడా రంగంలోకి దింపారు. నాలుగు గంటల్లో ఉగ్రవాదుల ఆటకట్టయింది.

No comments:
Post a Comment