Tuesday, December 13, 2016

లైంగిక వేధింపులకు గురైన సోనం కపూర్‌!

ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ కూతురు, బాలీవుడ్‌ కథానాయిక సోనం కపూర్‌ తాజాగా ఓ వ్యక్తిగత విషయాన్ని అంగీకరించారు. తాను యుక్త వయస్సులో ఉన్నప్పుడు లైంగిక వేధింపుల బారిన పడ్డానని ఆమె తెలిపారు. 'నా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయిన విషయం నాకు తెలుసు. ఇది నన్ను ఎంతో మానసిక వేదనకు గురిచేసింది' అని సోనం పేర్కొన్నారు. ప్రముఖ సినీ విమర్శకుడు రాజీవ్‌ మసంద్‌.. 2016 సినిమాల్లో బలమైన మహిళా పాత్రలతో అలరించిన సోనం కపూర్‌, విద్యాబాలన్‌, అనుష్క శర్మ, రాధికా ఆప్తేలతో ప్రత్యేక షో నిర్వహించారు. ఈ షో ప్రోమో వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

No comments:

Post a Comment