తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు సమయానికి చేరుకోవడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సాహసమే చేశారు. బోయింగ్ 737 లగ్జరీ ప్లేన్ లో చెన్నైకి చేరుకున్న ప్రణబ్.. అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్ వాళ్లు రవాణకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్‌లో మెరీనా బీచ్‌కు వెళ్లారు. ఇందులో బోయింగ్‌లాగా లగ్జరీ సీట్లు ఉండవు. దీంతో ప్రణబ్ ఓ బెంచ్‌పై సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించారు. అంతకుముందు ఢిల్లీ నుంచి చెన్నై రావడానికి మొదట ప్రణబ్ బయలుదేరినా.. విమానంలో సాంకేతిక లోపం కారణంగా బయలుదేరిన కొద్దిసేపటికే మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు.

No comments:
Post a Comment