Saturday, December 10, 2016

తొలగించబడిన శేఖర్‌రెడ్డి.......

బోర్డు సభ్యుడిగా ఉన్న శేఖర్‌రెడ్డికి తితిదే ఉద్వాసన పలికింది. చెన్నైలోని శేఖర్‌రెడ్డి నివాసం, కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శేఖర్‌రెడ్డి వద్ద పెద్దఎత్తున నల్లధనం వెలుగుచూడటంతో బోర్డు సభ్యుడి బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. శేఖర్‌రెడ్డి కార్యాలయం, ఇంట్లో నిన్నటి వరకు రూ.107కోట్ల నగదు, 127 కిలోల బంగారం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం శేఖర్‌రెడ్డి అనుచరుడి కారును వెంబడించి అందులో ఉన్న రూ.24కోట్ల కొత్త రెండువేల రూపాయల నగుదు స్వాధీనం చేసుకున్నారు.ఐటీ అధికారులు  శేఖర్‌రెడ్డితో పాటు అతని అనుచరులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రేమ్‌ను కూడా  అరెస్టు చేసే అవకాశముంది.

No comments:

Post a Comment