భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.ఈ సారి ఆయన అన్నాడీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ పగ్గాలు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ చేతిలో పెడితే కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పన్నీర్ సెల్వం స్వతంత్రంగా పనిచేయలేరని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ఒకే సంస్థగా మనుగడ సాగించలేదన్నారు. శశికళ పార్టీ బాధ్యతలు తీసుకుంటే సీఎం పన్నీర్ సెల్వం స్వతంత్రంగా పనిచేసే వీలు ఉండదని, ఆమె తన కుటుంబం నుంచి ఎవరినైనా ఆ పోస్టుకోసం వత్తిడి తీసుకువస్తారని అభిప్రాయపడ్డారు.

No comments:
Post a Comment