Wednesday, December 7, 2016

కన్నీటి వీడ్కోలు...

తమిళనాట 'పురట్చి తలైవి' సెల్వి జయలలిత ఇక సెలవంటూ తుది వీడ్కోలు తీసుకున్నారు. అశేష జనవాహిని కన్నీటివదనంతో ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. కడలి ఒడ్డున ఎంజీఆర్‌ సమాధి ఉన్న ప్రాంతంలో 'అమ్మ' పార్థివదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టారు. ఆమె పార్థివదేహంపై కప్పిన త్రివర్ణ పతాకానికి త్రివిధ దళాలు గౌరవవందనం చేసి జాగ్రత్తగా తీసి జయ స్నేహితురాలు శశికళకు అందజేశాయి. అనంతరం పురోహితుడి సమక్షంలో ఆమె, జయ అన్న కుమారుడు దీపక్‌ జయకుమార్‌లు కలిసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అనంతరం జయలలిత భౌతికకాయాన్ని గంధపు పెట్టెలో పెట్టి భూమి లోపల భద్రపరిచారు.

No comments:

Post a Comment