Friday, December 9, 2016

అరంగేట్రం తోనే .. సెంచరీ!

అరంగేట్రం టెస్టులోనే యువ ఓపెనర్‌ కీటన్‌ జెన్నింగ్స్‌ (219 బంతుల్లో 13 ఫోర్లతో 112) అద్భుత శతకానికి తోడు మొయిన్‌ అలీ (104 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 50) హాఫ్‌ సెంచరీతో సత్తా చాటడంతో భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా గురువారం మొదలైన నాలుగో టెస్టును ఇంగ్లండ్‌ ధాటిగా ఆరంభించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలిరోజు ఆట చివరకు ఐదు వికెట్లకు 288 రన్స్‌ సాధించింది. కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ (46) కూడా రాణించాడు.

No comments:

Post a Comment