సెంట్రల్ ఢిల్లీలోని చాందినీచౌక్‌లో యాక్సిస్ బ్యాంక్ బ్రాంచిలో 44 నకిలీ అకౌంట్లు సృష్టించారని, వాటిలో సుమారు రూ.100 కోట్ల మేర రద్దయిన పాతనోట్లు డిపాజిట్ చేశారని ఐటీ అధికారులు గుర్తించారు. నోట్ల రద్దు అనంతరం ఈ బ్రాంచీలో మొత్తం రూ.450 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు పేర్కొన్నారు. రిజర్వుబ్యాంకు నిర్దేశించిన నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలకు విరుద్ధంగా, నకిలీ డాక్యుమెంట్లతో ఈ అకౌంట్లను తెరిచారని పేర్కొన్నారు. చాందినీచౌక్ బ్రాంచి అధికారులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

No comments:
Post a Comment