Wednesday, December 14, 2016

సోదరుడి వివాహ వేడుకలోసన్నీ లియోన్...

బాలీవుడ్‌ నటి సన్నీ లియోని తన సోదరుడు సందీప్‌ ఓహ్రా వివాహ వేడుకలో సందడి చేశారు. వృత్తిరీత్యా చెఫ్‌ అయిన సందీప్‌ ఓహ్రా, కరిష్మా నాయుడుల వివాహం సిక్కు సంప్రదాయం ప్రకారం లాస్‌ ఏంజెల్స్‌లో జరిగింది. ఈ వేడుకకు సన్నీ తన భర్త డేనియల్‌ వెబర్‌తో కలిసి హాజరయ్యారు. పెళ్లికి ముందు నిర్వహించే పార్టీలో నలుపు రంగు గౌనులో మోడ్రన్‌గా కనిపించిన సన్నీ వివాహ వేడుకకు మాత్రం నీలి రంగు కుర్తా పైజామా దుస్తుల్లో సంప్రదాయంగా కనిపించారు.

No comments:

Post a Comment