
మహిళల టీ20 ఏషియాకప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై 17 పరుగుల తేడాతో ఇండియా గెలిచి వరుసగా ఆరోసారి ట్రోఫీ ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఆరు టీ20 ఏషియాకప్ టోర్నీలు కాగా.. అన్నిసార్లూ మన మహిళల జట్టే విజేతగా నిలవడం విశేషం.
హైదరాబాదీ స్టార్ మిథాలీరాజ్ (73 నాటౌట్)ఈసారి ఫైనల్ మ్యాచ్ లో కీలకపాత్ర పోషించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్లకు గాను 121 పరుగులు చేసింది. మిథాలీరాజ్ 65 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఈ ఏషియాకప్ లీగ్ లోనూ భారత్.. పాకిస్థాన్‌పై గెలిచిన విషయం తెలిసిందే. అందరికి షేర్ చేయండి.
No comments:
Post a Comment