Monday, December 5, 2016

అమ్మ వారసుడిగా పన్నీర్ సెల్వం !

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు చోటుచేసుకున్నాయి. అధికార మార్పిడికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం జయలలిత ఆరోగ్యం మరింత విషమించినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జయలలిత వారసుడిగా కేబినెట్ మంత్రి పన్నీరు సెల్వంను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి మద్దతుగా 135 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. డిక్లరేషన్ ఫాంపై ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు పన్నీరు సెల్వంను సీఎంగా ప్రకటించే అవకాశం ఉంది.

No comments:

Post a Comment