Wednesday, December 14, 2016

ఒరాకిల్‌ అదిరిపోయే ఆ'ఫర్‌' .. IIT స్టూడెంట్!

ఐఐటీ-బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (వారణాసి) విద్యార్థికి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఒరాకిల్‌ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఇక్కడ నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఓ విద్యార్థికి రూ.1.20కోట్లు వార్షిక వేతనంగా చెల్లించేందుకు ఒరాకిల్‌ ముందుకొచ్చిందని ప్లేస్‌మెంట్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ సారి నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎక్కువమంది కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులే ఎంపికయ్యారని వారు తెలిపారు.

గతేడాది నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఓ విద్యార్థికి 2.27 కోట్లు ప్యాకేజీగా ఇచ్చేందుకు గూగుల్‌ సంస్థ ముందుకొచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ నెల 1న ప్రారంభమైన ఇంటర్వ్యూలు 19 వరకు కొనసాగుతాయని వారు తెలిపారు. 90 వరకు కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండగా.. 500 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

No comments:

Post a Comment