Saturday, December 31, 2016
సెంట్రల్ బాగ్దాద్‌లో పేలుళ్లు!
Friday, December 30, 2016
జనవరి 30వరకు శంషాబాద్ లో ఆంక్షలు!
శంషాబాద్ విమానా శ్రయంలోగణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రతా చర్యల్లో జనవరి 30 వరకు ఆంక్షలును బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే విజిటర్స్‌కు అనుమతి లేదు,అంతేకాక గురువారం దీనికి సంబంధించిన టికెట్ల జారీని నిలిపివేశారు. ప్రయాణికులను కారు పార్కింగ్ వరకు అదికూడా స్వాగతం, వీడ్కోలు పలికేవారిని మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణికులు సకాలంలో చేరుకుని సహకరించాలని అధికారులు లు కోరారు.
Thursday, December 29, 2016
ప్రధాన కార్యదర్శిగా' చిన్నమ్మ' శశికళ!
అన్నాడిఎo కే పార్టీ ప్రధాన కార్యదర్శిగా' శశికళ నటరాజన్ ను ఎన్నుకున్నారు.ఈరోజు పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరయ్యారు.దివంగత మాజీ సిఎo జయలలితకు సంతాపం తెలిపి 14 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.శశికళ నాయకత్వంలోపనిచేయాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రధాన కార్యదర్శిగా' ఎన్నుకున్నారు.జయలలిత పుట్టినరోజు ను రైతుల దినోత్సవంగా ప్రకటించిన తీర్మానాన్ని ఆమోదించారు.
కోహ్లి,అనుష్కశర్మ ల నిశ్చితార్థం!
టీమిండియా కెప్టెన్ కోహ్లి, బాలీవుడ్ నటీ అనుష్కశర్మ తమ లవ్‌స్టోరీకి ఇక ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు.ఈ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌కి జనవరి 1 న్యూ ఇయర్ డే నాడే సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఈ ఇద్దరికి ఉత్తరాఖండ్‌లోని నరేంద్రనగర్ ఆనందా హోటల్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగే అవకాశం ఉంది.ఈ ప్రేమజంట ఉత్తరాఖండ్ కి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ అక్కడి నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ పోస్ట్‌లు చేస్తున్నారు.
బంపర్ ఆఫర్......అమెజాన్ !
ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ వినియోగదారలను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు వస్తువులను ఈ వెబ్‌సైట్‌లో కొనుగోళ్లు చేసేవారు,కానీ ఇప్పటి నుంచి అమ్మకాలు కూడా ఓఎల్‌ఎక్స్, క్విక్కర్ వంటి ప్రత్యేక వెబ్‌సైట్లు చేసే విధంగా అమెజాన్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది.
వస్తువును అమ్మాల్సిన విధానం...
మీరు వస్తువు అమ్మకానికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఆ వస్తువును అమ్మకానికి పెట్టినప్పుడు ఎవరైనా ఆర్డర్ చేస్తే, అమెజాన్ సిబ్బంది మీ వద్దకు వచ్చి వస్తువును ప్యాకింగ్ చేసి,డెలివరీ ఆర్డర్ చేసుకున్న అడ్రస్‌కు చేరవేస్తారు. ఇలా చేయడం వల్ల మీ వస్తువును అమ్మినందుకు సంస్థ, వచ్చిన మొత్తం నుంచి కొంత తీసుకుంటుంది. అది ఎలాగంటే మీరు అమ్మిన వస్తువు ధర రూ. 1000 లోపు ఉంటే 10 రూపాయలు తీసుకోగా రూ. 1000 నుండి రూ. 5000 మధ్యలో ఉంటే 50 రూపాయలు, రూ. 5000ఆ పైన ఉంటే 100 రూపాయలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి బెంగుళూరులో మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. త్వరలో సంస్థ ప్రతినిధులు ఈవిధానం ను అన్ని నగరాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
జయ మృతిపై అవసరమైతే రీ- పోస్ట్ మార్టం...మద్రాస్ హైకోర్ట్!
జయలలిత మృతిపై సందేహాలున్నాయని అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వైద్యనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులో దాఖలైన పిల్‌పై జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్తిబన్ ధర్మాసనం విచారణ సందర్భంగా,జయ కు ఎలాంటి చికిత్స అందిందో కేంద్రానికి తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉందో తెలియదని ఆయన చెప్పారు. జనవరి 9లోగా జయ మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు, నోటీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని తీవ్రంగా మందలించారు. జస్టిస్ వైద్యనాథన్ తాను ఒక్కడినే ఈ పిటిషన్లను విచారించాల్సి వస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుందని వ్యాఖ్యానించడం విశేషం.
Wednesday, December 28, 2016
ఖైదీ నంబర్ 150’ మూడో పాట విడుదల...
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ నుంచి విడుదలైన రెండు పాటలుఇప్పటికే చిరు అభిమానుల్లో మంచి జోష్ నింపుతున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్‌లో మార్కెట్‌లోకి వచ్చిన రెండు పాటలు తాజాగా చిరు క్రేజీ ప్రాజెక్టు నుంచి మూడో పాటను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది. ‘సాయం కాలాన..సాగర తీరాన అంటూ సాగే ఈ పాటను హరిహరన్, శ్రేయా ఘోషల్ పాడారు. సంక్రాంతికి థియేటర్లలో సందడిచేయనున్న వినాయక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఢిల్లీ కి కొత్త గవర్నర్.....
ఢిల్లీ కి కేంద్ర మాజీ హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనిల్ బైజాల్‌ను గవర్నర్‌గా నియమించారు. బైజాల్ 1969 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. నజీబ్ జంగ్ ఈ నెల 22న రాజీనామా చేశాక, ఇవాళ ఆయన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదించారు. ఆ వెంటనే బైజాల్‌ను ఢిల్లీ కి కొత్త గవర్నర్‌గా నియమించారు.ప్రస్తుతం బైజాల్ స్వామి వివేకానంద థింక్ ట్యాంక్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు.
సడలించబోతున్నన విత్ డ్రా పరిమితి !
ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్ పై ప్రజలనుద్దేశించి డిసెంబర్ 30న ప్రసంగించనున్నారు. ఇందులో మోదీ బ్యాంకులు నుంచి నగదు పరిమితి ఏటీఎం విత్ డ్రాలను సడలించనున్నారని ప్రస్తుతం నిబంధనల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రధాని ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న రోజుకు రూ.2,500, వారానికి రూ.24,000 పరిమితిని సడలించి, రోజుకు రూ.4000, వారానికి రూ.40,000 తీసుకునేలా ప్రకటన ఉండబోతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు ద్రవ్య పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి తనకు 50 రోజులు గడువు కావాలని అలాగే నగదు కొరత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 22న కొత్త రూ.500, రూ.2000 నోట్ల ప్రింటింగ్ కు టెండర్లు వేయనున్నారని తెలుస్తోంది.
Saturday, December 24, 2016
లిబియా హైజాకర్లు లొంగుబాటు...
విమానాన్ని హైజాక్ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నామని మాల్టా ప్రధాని జోసఫ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ హైజాకర్లు లిబియా మాజీ నియంత గడాఫీ మద్దతుదార్లని,వారి రాజకీయ పార్టీని స్థాపించాలనే లక్ష్యంతో ఉన్నారని తెలిపారు. మాల్టా ప్రధాని జోసఫ్, మాల్టాలో రాజకీయ ఆశ్రయాన్ని వారు కోరుకుంటున్నారని,అయితే,హైజాకర్లు రాజకీయ ఆశ్రయాన్ని కోరలేదని వెల్లడించారు. వారి నుండి ఒక గ్రెనేడ్, రెండు పిస్టళ్లు దొరికాయని తెలిపారు.
డేట్ ఫిక్స్ అయిన 'కాటమరాయుడు'..
పవర్‌స్టార్ పవన్ కాళ్యాణ్ అందాల తార శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కిషోర్‌కుమార్ పార్థసారధి శర వేగంగా తీస్తున్నారు అభిమానులు, సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తోంది.షూటింగ్ అనుకున్నవిధంగా జరిగితే వచ్చే ఏడాది మార్చిలో ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలాచిలో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం ఇస్తున్నారు. కిషోర్‌కుమార్ పార్థసారధి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని రద్దు చేసిన ఎన్నికల సంఘం....
కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 12 పార్టీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది వీటిలో లక్ష్మీపార్వతి ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ తెలుగు దేశం, ఇంద్రారెడ్డి ఏర్పాటు చేసిన జై తెలంగాణ పార్టీ నటుడు హరికృష్ణ ఏర్పాటు చేసిన అన్న తెలుగు దేశం కూడా ఉన్నాయి. ఆంధ్రనాడు పార్టీ, అన్న తెలుగుదేశం పార్టీ, ముదిరాజ్ రాష్ట్రీయ సమితి,బహుజన రిపబ్లికన పార్టీ, భారతీయ సేవాదళ్, జై తెలంగాణ పార్టీ, నేషనల్ సిటిజెన్స్ పార్టీ, ఎనటీఆర్ తెలుగుదేశం పార్టీ (లక్ష్మీపార్వతి), సత్యయుగ్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ.
Friday, December 23, 2016
విమానంను పేల్చివేస్తామంటున్న హైజాకార్లు....
లిబియా ప్రభుత్వ రంగ సంస్థ ఆఫ్రికియా ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్ 320 , 111మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బందితో బయలుదేరిన విమానాన్ని శుక్రవారం దుండగులు హైజాక్ చేశారు.భద్రతాదళాలు అత్యవవసర చర్యలు చేపట్టినట్లు తెలిపారు . మాల్టీస్ మీడియా ఎయిర్ బస్ 320ని దారి మళ్లించి మాల్టా లో ల్యాండ్ చేసినట్టు, హైజాకర్లు విమానాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తున్నట్టు తెలిపింది.హైజాకర్లు నైరుతీ లిబియా సబా నుంచి ట్రిపోలీ వెళుతుండగా దారి మళ్లించారు. దీంతో మాల్టా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని విమానాలను రద్దుచేసీ,మరికొన్నింటిని దారి మళ్లించారు.మరోవైపు మాల్టీస్ ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ కూడా హైజాక్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా దృవీకరించారు. దుండగుల వివరాలు, డిమాండ్లు ఇతర అంశాలు ఇంకా తెలియాల్సి వుంది.
'వంగవీటి' కి భారీబందో బస్త్....
వంగవీటి చిత్రం ,వంగవీటి రంగా, దేవినేని నెహ్రూల మధ్య జరిగిన గొడవల నేపధ్యంలో తెరకెక్కడంతో రంగా అభిమానులు ఇటు దేవినేని అభిమానులు థియేటర్ల దగ్గర హల్ చల్ చేయడంతో ఏ సినిమాకు ఏర్పాటు చేయనంత బందోబస్త్ శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఏపీ లోని పలు జిల్లాలలో పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాటు చేసినట్టు టాక్. 1970-80లో విజయవాడ నేపథ్యంలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో వర్మ వంగవీటి సినిమాలో ఎవరిని ఎలా చూపించాడు, ఏ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది అనే అంశం పై మరి కొద్ది నిమిషాలలో క్లారిటీ రానుండగా, అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆ ఉగ్రవాదిని హతమార్చిన పోలీసులు....
జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో ట్రక్కుతో దాడి చేసిన ఘటనలో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు శుక్రవారం ఇటలీలో ఉత్తరాదిన ఉన్న మిలాన్ నగరంలో జరిగిన కాల్పుల్లో మరణించినట్టు భద్రతాదళ అధికారులు చెప్పారు. నిదితుడు ట్యునీసియాకు చెందిన 24 ఏళ్ల అనిస్ అమ్రిగా పోలీసులు భావిస్తున్నారు.పోలీసులు ఇటలీ మేగజైన్ పనోరమ వెబ్ సైట్‌లో కాల్పుల ఘటనకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. తమ సైనికుడే ఈ దాడికి పాల్పడింది అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది
Thursday, December 22, 2016
భారీ అగ్ని ప్రమాదంలో 140 ఇళ్లు...!
జపాన్ కోస్తా తీరంలోని ఇటోయిగావాలో ఈ ఉదయం ఓ రెస్టారెంట్‌లో ప్రమాదవశాత్తు మంటలు ఎగసిపడి ఈదురు గాలుల దాటికి చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించడంతో మొత్తం తక్కువలో తక్కువగా 140 ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయని,గంటకు 56 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించినట్టు జపాన్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ప్రజలను సమీపంలోని ఇళ్ల నుంచి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రమాదం కి గల కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అత్యంత సన్నని,తక్కువ మందం ల్యాప్‌టాప్ విడుదల...!
ప్రపంచంలోనే అత్యంత సన్నదైన,అతి తక్కువ మందం కలిగిన ల్యాప్‌టాప్‌ను 'ఏసర్' సంస్థ విడుదల చేసింది.ఇప్పటికే ఐఎఫ్‌ఏ 2016 షోలో ఏసర్ ప్రదర్శించగా 'స్విఫ్ట్ 7' పేరిట విడుదలైన కేవలం 1.2 కేజీల బరువు గల ఈ ల్యాప్‌టాప్‌ను యూజర్లకు అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.1.09 లక్షలు. ఈ ల్యాప్‌టాప్ లో14 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 8 జీబీ డీడీఆర్3 ర్యామ్, హెచ్‌డీ వెబ్‌క్యామ్ , 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, డాల్బీ ఆడియో,,8 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మరో సంచలన ప్రకటన.....రిలయన్స్ జియో!
రిలయన్స్ జియో 4జి ద్వారాఅందిస్తున్న ఉచిత ఇంటర్నెట్,టాక్ టైం ఆఫర్ ను త్వరలో3జి ఫోన్లు ఉపయోగిస్తున్న వారికి కూడా అందించేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది.దీనికోసం ఒక యాప్ ని కూడా తయారుచేసారని సమాచారం.3జి వారికి కూడా 4జి సిమ్ ఉపయోగిస్తున్న వారికీ అందుతున్న ఉచిత సేవలు అందించడం తద్వారా మరింత పెద్ద సంఖ్యలో వినియోగదారులు ను రిలయన్స్ జియో ఆకర్షించే లక్ష్యంతో ముందుకెళ్తున్నది.ఈ యాప్ ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను కూడా కస్టమర్లకు అందిస్తారని తెలుస్తున్నది.
వీడియో కి చిక్కిన' ఘోస్ట్' షార్క్!
చిమైరా చేప (ఘోస్ట్ షార్క్)మహా సముద్రాల అడుగు భాగంలో జీవించే అంతుచిక్కని జలచరాల్లో ఒకటి. ఒక స్వచ్ఛం ద సంస్థ సహకారంతో మొంటెరే బే అక్వారియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు కాలిఫోర్నియా, హవాయి మధ్య రిమోట్‌తో నడిచే వాహనాలను సముద్ర జలాల్లో వదిలారు. అవి 6700 అడుగుల లోతున కనిపించిన ఈ చిమైరాచేప కదలికలను వీడియోలో చిత్రీకరించి పంపడంతో పరిశోధకులు ఇటీవలే దాని జీవిత విధానంపై రూపొందించిన పత్రాలను రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మీడియాకు విడుదలచేసింది. ఈ చేప వింత లక్షణాలతో ఉండడంవీటి కండ్లు పాలిపోయినట్లు నిర్జీవంగా కనిపిస్తాయి.
తమిళనాడు కొత్త సీఎస్ నియామకం..
తమిళనాడు సీఎస్‌గా ఉన్న రామ్మోహన్‌రావుపై జరిగిన ఐటీ దాడులు నేపథ్యంలోభారీగా నగదు,ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ ఆయనపై కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఆయనను సీఎస్ పదవి నుండి తొలగించింది. కొత్త సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గిరిజా వైద్యనాథన్ ల్యాండ్ సర్వే కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
మెక్సికో మార్కెట్లో పేలుళ్లు ....
బుధవారం మెక్సికోలోని తుల్తెపెక్ పటాకుల మార్కెట్లో ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది.ఈ పేలుళ్లలో 31 మంది చనిపోగా, 72 మంది గాయపడ్డారు. మెక్సికో నగర శివారులోని మార్కెట్లో పటాకులకు మంటలు అంటుకోవడంతో పేలుళ్లు జరిగాయి. క్రిస్‌మస్ మరియు కొత్త సంవత్సర వేడుకల కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలతో మార్కెట్ సందడిగా ఉన్నపుడు అకస్మాత్తుగా పేలుళ్లు సంభవించాయి.ఈ పేలుళ్లకు మార్కెట్లో ఉన్న వారు పిల్లలతో సహా పరుగుపరుగున బయటకు వచ్చారని, వారికి అప్పటికే మంటలు అంటుకున్నాయని వాల్టర్ గర్దునో అనే వ్యక్తి చెప్పాడు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.50 గంటలకు పేలుళ్లు జరిగాయి. రకరకాల బాణసంచా పేలడంతో రకరకాల రంగుల వెలుగులు, మంటలతో దట్టమైన పొగలు లేచి మెక్సికో నగరం వరకు వ్యాపించాయి.
Wednesday, December 21, 2016
ఆర్బీఐ తాజా నిబంధన ఎత్తివేత.. .
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా డిపాజిట్ దారులకు ఊరట కల్పిస్తూ నిర్ణయం తెలుసుకుంది. ఆర్బీఐ తాజాగా తీసుకొచ్చిన నిబంధనపై రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయడం ఫై వెనక్కి తగ్గింది. ప్రజల నుంచి ఈ నిబంధన వ్యతిరేకత వస్తుండటంతో ఈ ఆంక్షలు ను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ నోటీఫికేషన్ జారీచేసింది.
బెర్లిన్‌లో ఉగ్రదాడి...
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో క్రిస్మస్ పండుగ సందర్భంగా షాపింగ్ చేసుకొందామని వచ్చిన సందర్శకులను కిక్కిరిసిన షాపులను లక్ష్యంగా చేసుకొని ట్రక్కుతో పాకిస్తానీ సరనార్దీ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 12 మంది మరణించగా. 50 మంది గాయపడ్డారు. జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తూ,దాడి వెనుక ఉగ్రవాదుల హస్తముందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు
Tuesday, December 20, 2016
సీనియర్ నటుడికి అస్వస్థత.....
సూపర్‌హిట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో, అబితాబ్ బచ్చన్‌తో కలిసి 'షోలే' లాంటి సినిమాలో నటించిన ధర్మేంద్ర (81) జీర్ణకోశ (గ్యాస్ట్రోఎంటెరిటిస్) సమస్యతో బాధపడుతున్న ఆయనను వెంటనే ముంబైలోని నానావతికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 70వ దశకంలో మాస్ హీరోగా ధర్మేంద్ర అలరించాడు. 1975లో వచ్చిన 'షోలే' సినిమాలో ధర్మేంద్ర కెరీర్‌లో మేలిమలుపుగా నిలిచిపోయింది.ధర్మేంద్రకు చికిత్స అందిస్తున్న డాక్టర్ విశేష్ అగర్వాల్ రెండురోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.
Monday, December 19, 2016
లోకనాయకుడి' డ్రీమ్ ప్రాజెక్ట్ కు మళ్లీ రెక్కలు!
తాజాగా కమల్‌హాసన్ ఈ సినిమా అంశంపై లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్‌కరణ్‌ను లండన్‌లో కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాకు మళ్లీ రెక్కలు వచిన్నట్టు తెలుస్తోంది. తమ ప్రాజెక్ట్లు లు పూర్తయ్యాక కమల్ మరియు సుభాష్‌కరణ్ ‘మరుదనాయగం’పై దృష్టిసారిస్తారని అంటున్నారు.
సంచలన నిర్ణయం తీసుకున్న 'సైరస్ మిస్త్రీ'...
సైరస్ మి స్త్రీ టాటా సన్స్ ఛైర్మన్ గా తొలగించబడిన తరువాత టాటా గ్రూపుకు చెందిన లిస్టెడ్ కంపెనీలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి తన పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు.టాటా కుటుంబం గ్రూపునకు గత అయిదు దశాబ్దాలుగా తను ఎనలేని సేవలు చేసానని మిస్త్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో కంపెనీలను దారిలో పెట్టేందుకు ప్రయత్నం చేశాననీ, తనను రతన్ టాటా అడ్డుకున్నారని మిస్త్రీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్ట విరుద్ధంగా తనను తొలగించారని, టాటా గ్రూపు సమాధానం కోసం ఎనిమిదివారులు ఎదురుచూశానని, చివరికి ఫలితం లేకపోవడంతో టాటా గ్రూపురక్షణ కోసం న్యాయపోరాటానికి పూనుకున్నట్టు తన లేఖలో తెలిపారు.టాటా గ్రూపునకు చెందిన టాటా సన్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, టాటా మోటార్స్ , టాటా పవర్, ఇండియన్ హోటల్స్ లోని అన్ని పదవులకు తను రాజీనామా చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.టాటా గ్రూపులో నెలకొన్నపరిణామాలు బాధించాయని ఇకముందు పోరాటం మరింతగా కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
నోట్ల డిపాజిట్ ఫై కేంద్రం పరిమితులు..
బ్యాంకుల్లో రద్దయిన పాత 500, వెయ్యి నోట్లను డిపాజిట్ చేయడంపై కేంద్రం మరిన్ని పరిమితులు విధించింది. ఇవాళ్టి నుంచి ఒక అకౌంట్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే ఐదు వేలకు పైగా నగదును డిపాజిట్ చేసే అవకాశం ఈ నెల 30 వరకు ఉంటుందని ఆర్థికశాఖ వెల్లడించింది. అది కూడా కేవైసీ వివరాలు ఇచ్చిన అకౌంట్లలోనూ అంతేకాక ఇప్పటివరకు ఈ మొత్తాన్నిఎందుకు డిపాజిట్ చేయలేదన్న వివరణ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన నల్లదనం డిపాజిట్‌పై ఎలాంటి పరిమితి లేదని స్పష్టంచేసింది.
ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ !
చెన్నై టెస్ట్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. అతనికిదే టెస్టుమ్యాచ్ ల్లో తొలి ట్రిపుల్ సెంచరీ. తన కెరీర్లో కేవలం మూడో టెస్ట్ ఆడుతున్న కరుణ్. సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.కరుణ్ నాయర్ టెస్టుల్లో సాధించిన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన తొలి భారత బ్యాట్స్ మన్ గా. అంతేకాకుండ టెస్టు క్రికెట్ చరిత్రలో గ్యారీ సోబర్స్, బాబ్ సింప్సన్ తర్వాత తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన మూడో ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
ఉరిశిక్ష.. ఆ ఐదుగురు దోషులకు!
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ 21 ఫిబ్రవరి 2013న జరిగిన జంట పేలుళ్ల ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఈ ఐదుగురూ దోషులేనని నిర్ధారించిన కోర్టు ఇవాళ వీరికి శిక్షలను ఖరారు చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ సహా మొత్తం ఆరుగురు నిందితులుండగా భత్కల్ పరారీలోనే ఉన్నాడు. మొదటిసారిగా ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ కేసు భారత దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడింది ఈ నేపథ్యంలో అత్యంత పటిష్ట బందోబస్తు కోర్టు ఉన్న చర్లపల్లి జైలు వద్ద సోమవారం ఏర్పాటు చేశారు.
Sunday, December 18, 2016
రాహుల్ అరుదైన రికార్డు....
ఇంగ్లండ్ తో చివరి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో చెన్నైలో ఇంగ్లండ్పై భారత ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసి ఘనత సాధించాడు. కేఎల్ రాహుల్ వ్యక్తిగత 193 స్కోరును సాధించే క్రమంలో బీకే కుందేరేన్ రికార్డును బద్దలు కొట్టాడు.1964లో చెన్నైలో ఇంగ్లండ్ పై కుందేరేన్(192) భారత్ తరపున అత్యధిక పరుగుల ఓపెనింగ్ రికార్డు సృష్టించాడు.
నగరంలో కాల్పుల కలకలం....
హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని శ్రీదుర్గా కనుమిల్లి అపార్ట్మెంట్లో బైక్పై వచ్చిన గుర్తు తెలియని దుండగుడు మన్మథ్ దాలియా అనే వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యాడు, గాయపడిన వ్యక్తి కేబీఎస్ బ్యాంకు సీఈవో అని తేలింది.
దుండగుడు ,ఆదివారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ వాచ్మెన్ను సంప్రదించి మన్మథ్ ఇంట్లోకి ప్రవేశించాడు. మన్మథ్తో పది నిమిషాల పాటు మాట్లాడిన ఆతను ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మన్మథ్ ను స్థానికులు వెంటనే వైద్యం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి. నోట్ల మార్పిడియే కాల్పులకు కారణమైనట్లు భావిస్తున్నారు.కేసు నమోదు చేసి దర్యాప‍్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
బర్నింగ్ స్టార్... వైరస్ !
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం చిత్రంలో తన కామెడీతో , ప్రేక్షకులకు దగ్గరై త్వరలో కొబ్బరి మట్ట అనే చిత్రంతో అభిమానులు ఎదురు చూస్తోన్న టైంలో సంపూ మరో సినిమాకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. ఎస్. ఆర్ .కృష్ణ దర్శకత్వంలో బర్నింగ్ స్టార్ సంపూ చేస్తోన్న సినిమాకు వైరస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా దీనికి నో వ్యాక్సిన్ ఓన్లీ టాక్సిన్ అనే ట్యాగ్ లైన్ తగిలించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాగా, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుని త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.
Saturday, December 17, 2016
ఐటీ దాడుల్లో పట్టుబడిన.. రూ.400 కోట్లు !
గుజరాత్ రాష్ట్రం లోని సూరత్‌లో ఐటీ శాఖ జరిపిన మెరుపు దాడుల్లో ఫైనాన్షియర్ కిశోర్ భజియావాలా ఇళ్లు, కార్యాలయాల్లో రూ. 400 కోట్ల విలువైన నగదును, బంగారం, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదులో భారీగా కొత్త రూ. 2000 నోట్లు ఉండగా, మొత్తం 13 బ్యాంకుల లాకర్లను అధికారులు సీజ్ చేశారు.
సెన్సార్ పూర్తిచేసుకున్న 'వర్మ' వంగవీటి.....
రాజకీయ నాయకుడు వంగవీటి రంగా జీవిత నేపథ్యంలో వర్మ వంగవీటి చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. వంగవీటి చిత్రాన్ని డిసెంబర్ 23న లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయనుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది.
కార్గో విమానంలో రూ5 వేల కోట్లు...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులు, ఏటీఏంలలో డబ్బు లేక గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు రూ.5 వేల కోట్ల కొత్త రూ.500, రూ.2000 నోట్లును పటిష్ట భ్రదత నడుమ కార్గో విమానంలో పంపింది. చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగాక.. ఆ భారీ మొత్తాన్ని రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల పరిధిలోని బ్యాంకులు, ఏటీఎంలకు పంపిణీ చేయనున్నారు.
Friday, December 16, 2016
లోకేష్ కాన్వాయ్ లో పల్టీలు కొట్టిన కారు....
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు బొమ్మూరు సమీపంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ లోని ఓ కారు వేమగిరి వద్ద ఢివైడర్‌ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కారు డ్రైవర్ మరియు గన్‌మెన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
R G V సెన్సేషనల్ ప్రాజెక్ట్......
రామ్‌గోపాల్ వర్మ జయలలిత నిచ్చెలి శశికళ పేరుతో ఓ సినిమా తీయనున్నట్లు గురువారం రాత్రి ట్వీట్ చేశాడు. ఆ సినిమా కు ‘శశికళ’ అనే పేరును ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు ,ఓ పొలిటీషియన్ ఆప్త స్నేహితురాలి జీవిత నేపథ్యంలో సాగే సినిమా అని ,దివంగత జయలలిత అంటే తనకు గౌరవమని, శశికళ అంటే అంతకుమించిన గౌరవమని వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
దక్షిణాది హీరో,హీరొయిన్లు అరెస్ట్......
కేరళ రాజధాని తిరువనంతపురం పరిసరాల్లో నిర్మిస్తున్న నోవా కాజిల్ ఫ్లాట్ కాంప్లెక్స్‌లో తమకు అపార్ట్‌మెంట్లు ఇప్పిస్తామని ధన్య భర్త జాన్ జాకబ్‌కు చెందిన సంస్థ శాంసన్ అండ్ సన్స్ ద్వారా కోట్లాది రూపాయలూ కాజేశారని అందిన ఫిర్యాదు నేపథ్యంలో దక్షిణాది సినిమాల నటి ధన్య మేరీ వర్గీస్, ఆమె భర్త జాన్ జాకబ్‌లను,తమ్ముడు శామ్యూల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అరెస్ట్ చేశారు.వీరంతా ఒకొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ మొత్తం 100 కోట్ల రూపాయల మేర వసూళ్ళు చేసి ముఖం చాటేస్తున్నట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు 2014 నుండి నడుస్తోంది.
దిల్లీలోదారుణం...
దిల్లీలో ఓ ట్యాక్సీ డ్రైవర్ కారులోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉద్యోగం వెతుక్కునేందుకు దిల్లీకి వచ్చిన యువతి గురువారం రాత్రి ఎయిమ్స్ సమీపంలో ఉండగా.. ఓ టాక్సీ డ్రైవర్ నోయిడా వరకు లిఫ్ట్ ఇస్తానని కారులో ఎక్కించుకొని, కారును మోతీబాగ్ సమీపంలోఆపి ఆమెపై అత్యాచారం చేశాడు.అదే సమయంలో అటువైపుగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో ట్యాక్సీ డ్రైవర్ కారును వదిలి పారిపోయాడు. పోలీసులు యువతిని రక్షించి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కొన్ని గంటల్లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ వదిలి వెళ్లిన కారుపై కేంద్ర హోంశాఖ స్టిక్కర్ ఉండటంతో దీనిపై ఆరా తీస్తున్నారు.
Thursday, December 15, 2016
కర్ణాటక ఎక్సైజ్‌మంత్రి రాజీనామా....
సాయం అడగటానికి వచ్చిన మహిళను లైంగికంగా ఉపయోగించుకోవటానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై కర్ణాటక ఎక్సైజ్‌మంత్రి హెచ్‌వై మేతి బుధవారం రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆమోదించటమేగాక, జరిగిన ఘటనపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. మంత్రి రాజీనామాను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించానని, వీలైనంత త్వరగా ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ సీఐడీని ఆదేశించానని సిద్దరామయ్య బుధవారం విలేకర్లకు వెల్లడించారు.
Wednesday, December 14, 2016
జయలలిత మృతిపై.. సుప్రీం కోర్టులో పిటిషన్!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై కుట్ర జరిగిందని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. జయలలిత ప్రాణస్నేహితురాలు శశికళపై ఆరోపణలు చేస్తూ తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అమ్మ మృతిపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. జయలలిత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని ఆయన తెలిపారు.
సోదరుడి వివాహ వేడుకలోసన్నీ లియోన్...
బాలీవుడ్ నటి సన్నీ లియోని తన సోదరుడు సందీప్ ఓహ్రా వివాహ వేడుకలో సందడి చేశారు. వృత్తిరీత్యా చెఫ్ అయిన సందీప్ ఓహ్రా, కరిష్మా నాయుడుల వివాహం సిక్కు సంప్రదాయం ప్రకారం లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. ఈ వేడుకకు సన్నీ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి హాజరయ్యారు. పెళ్లికి ముందు నిర్వహించే పార్టీలో నలుపు రంగు గౌనులో మోడ్రన్‌గా కనిపించిన సన్నీ వివాహ వేడుకకు మాత్రం నీలి రంగు కుర్తా పైజామా దుస్తుల్లో సంప్రదాయంగా కనిపించారు.
ఉద్రిక్తత @ సెక్రటేరియట్ .....
తెలంగాణ సచివాలయం ఎదుట బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు.
సచివాలయంలోని సీ-బ్లాక్ ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదుపులోకి తీసుకున్న విద్యార్థి నాయకులను పోలీసులు స్టేషన్ కు తరలించారు.
ఒరాకిల్ అదిరిపోయే ఆ'ఫర్' .. IIT స్టూడెంట్!
ఐఐటీ-బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (వారణాసి) విద్యార్థికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఇక్కడ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ విద్యార్థికి రూ.1.20కోట్లు వార్షిక వేతనంగా చెల్లించేందుకు ఒరాకిల్ ముందుకొచ్చిందని ప్లేస్‌మెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ సారి నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎక్కువమంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులే ఎంపికయ్యారని వారు తెలిపారు.
గతేడాది నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఓ విద్యార్థికి 2.27 కోట్లు ప్యాకేజీగా ఇచ్చేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ నెల 1న ప్రారంభమైన ఇంటర్వ్యూలు 19 వరకు కొనసాగుతాయని వారు తెలిపారు. 90 వరకు కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండగా.. 500 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
రేపు అర్థరాత్రి వరకే పాత 500 నోటు చెల్లుబాటు....
గురువారం రాత్రి 12 గంటల వరకే పాత రూ.500 నోటు చెల్లుబాటు కానుంది. బిల్లులు కట్టేందుకు, మందులు కొనేందుకు, ప్రిపేయిడ్ రిచార్జ్‌లకు డిసెంబర్ 15వ తేదీ అర్థరాత్రి వరకు పాత 500 నోటును చెలామణి చేయవచ్చు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పాత 500 నోటును కేవలం బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 500 నోటుకు కల్పించిన వెసలుబాటు రేపు అర్థరాత్రితో ముగుస్తుందని ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు.
Tuesday, December 13, 2016
కేరళ ఫిల్మ్ ఫెస్టివల్... ఆరుగురు అరెస్టు !
అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జాతీయగీతం ప్రదర్శించే సమయంలో ఆరుగురు వ్యక్తులు లేచి నిలబడకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురంలోని నిషాగాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ఈజిప్టు చిత్రాన్ని ప్రదర్శించే ముందు జాతీయగీతాన్ని ప్రదర్శించారు.
ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఆరుగురు వ్యక్తులు జాతీయగీతం వచ్చే సమయంలో లేచి నిలబడలేదు. పోలీసులు, ఐఎఫ్‌ఎఫ్‌కే నిర్వాహకులు, ఛైర్మన్ కమల్‌తో పాటు పలువురు.. వారిని నిలబడమని కోరినా తిరస్కరించారు. దీంతో పోలీసులు ఆ ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా జాతీయగీతం ప్రదర్శించే ముందు యువత లేచి నిలబడకపోవడంపై భాజపా యూత్ వింగ్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం చెన్నైలోను ఇలాంటి ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
తప్పు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం.....చిదంబరం!
నాగపూర్‌లో మంగళవారం మాజీ కేంద్రమంత్రి చిదంబరం మీడియాతో మాట్లాడుతూ..ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి తప్పు చేసిందని, ఆ విషయం ముందే లీక్ అయిందని ఆరోపించారు. పెద్ద మొత్తంలో 2వేల నోట్లు పట్టుబడటంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా నగదు రహిత లావాదేవీలు లేవన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవరికి ప్రయోజనమో చూస్తూనే ఉన్నాం. నోట్ల రద్దు వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లింది. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు
లైంగిక వేధింపులకు గురైన సోనం కపూర్!
ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కూతురు, బాలీవుడ్ కథానాయిక సోనం కపూర్ తాజాగా ఓ వ్యక్తిగత విషయాన్ని అంగీకరించారు. తాను యుక్త వయస్సులో ఉన్నప్పుడు లైంగిక వేధింపుల బారిన పడ్డానని ఆమె తెలిపారు. 'నా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయిన విషయం నాకు తెలుసు. ఇది నన్ను ఎంతో మానసిక వేదనకు గురిచేసింది' అని సోనం పేర్కొన్నారు. ప్రముఖ సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్.. 2016 సినిమాల్లో బలమైన మహిళా పాత్రలతో అలరించిన సోనం కపూర్, విద్యాబాలన్, అనుష్క శర్మ, రాధికా ఆప్తేలతో ప్రత్యేక షో నిర్వహించారు. ఈ షో ప్రోమో వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
Monday, December 12, 2016
మూత్రవిసర్జన చేసినవారిపై జీహెచ్ఎంసీ చర్యలు!
నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేసినవారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఐమ్యాక్స్ రోడ్డులో మూత్రవిసర్జన చేసిన 12 మందికి జరిమానా విధించింది. ఓవైపు నగరాభివృద్ధికి కృషి చేస్తుంటే.. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయడం సరికాదని, నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను కోరారు.
Subscribe to:
Posts (Atom)

















































