Saturday, December 3, 2016

బాలీవుడ్ అగ్ర హీరోయిన్ సోదరుడి.. ఆత్మహత్య!

బాలీవుడ్ నటి ప్రీతిజింతా సోదరుడు నితిన్ చౌహాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు,తనకు కజిన్ బ్రదరైన నితిన్‌ వాహనంలో కూర్చుని తుపాకితో తలపై కాల్చుకున్నాడు. 

ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. శుక్రవారం నితిన్  తన ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. ఒక కారులో నితిన్ మృతదేహం లభించింది.  తన అత్తమామల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో నితిన్ పేర్కొన్నాడు. దీంతో,పోలీసులు నితిన్ అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

No comments:

Post a Comment