Friday, December 9, 2016

కుప్పకూలిన ఆరంతస్తుల భవనం....

హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ఆరు అంతస్తుల భవనం కుప్పకూలి న ఘటన కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 10 మంది మరణించినట్లు తెలుస్తున్నది. కనీసం 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నానక్‌రాంగూడ లోథ బస్తీలో 260 చదరపు గజాల స్థలంలో ఆరుఅంతస్తుల (ఆరు అంతస్తులు, అదనంగా పెంట్‌హౌస్) భవనాన్ని సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తూసింగ్ అనే వ్యక్తి గత ఎనిమిది నెలలుగా నిర్మిస్తున్నాడు. ఈ భవనం గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో పేకమేడలాగా కుప్పకూలి నేలమట్టమైంది. 

స్థానికులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 12 మందిని రక్షించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు సహాయకచర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.పరారీలో ఉన్నభవనం యజమాని సత్యనారాయణసింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు.

No comments:

Post a Comment