Saturday, December 3, 2016

వర్మకు.. వార్నింగ్ ఇచ్చిన రాధా వంగవీటి!

చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు.. వంగవీటి రాధా వార్నింగ్ ఇచ్చారు. . గతంలో విజయవాడ రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉన్న వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా వర్మ వంగవీటి సినిమాను తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వంగవీటి రాధా, మరికొందరు హైకోర్టులో వేసిన పిల్‌పై శుక్రవారం విచారణ జరగడం,
ఈ సినిమాలోంచి ‘కమ్మ కాపు’ పాటను తీసేస్తామని కోర్టుకు సినిమా నిర్మాతలు నివేదించడంతో, విచారణను కోర్టు పూర్తి చేయడం కూడా తెలిసిందే. వర్మ, రాధా కుటుంబ సభ్యులను కలిసి, తన ప్రయత్నాలను వాళ్లకు వివరించాలని నిశ్చయించుకుని  వర్మ విజయవాడ వచ్చీ రావడంతోనే వంగవీటి రంగా భార్య రత్నకుమారి, రంగా కుమారుడు రాధాకృష్ణతో భేటీ అయ్యాడు. కొద్దిసేపటి క్రితమే రంగా కుటుంబ సభ్యులను కలిశానని, భేటీ సంతృప్తికరంగా జరగలేదని ట్వీట్ చేశాడు. సమస్యలున్నాయని, కానీ తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ట్వీట్ చేశాడు. తాను ఇలాంటి సీరియస్ వార్నింగ్స్‌ చాలా చూశానని, కానీ నవ్వుతూ బెదిరించడం తొలిసారి చూశానని, ఇది చాలా ప్రమాదకరమని.. అయినప్పటికీ ‘వంగవీటి’ సినిమాపై వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేశాడు.

No comments:

Post a Comment