కమల్‌హాసన్ దశాబ్దాల క్రితమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను 1997లో క్వీన్ ఎలిజబెత్-2 చేతుల మీదుగా శ్రీకారం చేసుకొని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిన ఆ చిత్రమే ‘మరుదనాయగం’. కమల్ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన ఆ సినిమా మధ్యలో ఆగిపోయాక తిరిగి ప్రారంభిస్తారని చాలాసార్లు వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు.
తాజాగా కమల్‌హాసన్ ఈ సినిమా అంశంపై లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్‌కరణ్‌ను లండన్‌లో కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాకు మళ్లీ రెక్కలు వచిన్నట్టు తెలుస్తోంది. తమ ప్రాజెక్ట్లు లు పూర్తయ్యాక కమల్ మరియు సుభాష్‌కరణ్ ‘మరుదనాయగం’పై దృష్టిసారిస్తారని అంటున్నారు.
No comments:
Post a Comment