ఐటీ సంస్థలు పకడ్బందీగా సాఫ్ట్‌వేర్లను తయారు చేస్తున్నా వాటిలోకి హ్యాకర్లు మాల్‌వేర్లు, వైరస్‌లను చొప్పించి వినియోగదారుల డేటాను తస్కరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఆండ్రాయిడ్ వైరస్ 'గూలిగన్ (GOOLIGAN)' యూజర్ల డివైస్‌లలోకి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.
యూజర్లు సోషల్ మీడియాలో కనబడిన లింక్‌లను క్లిక్ చేసినప్పుడు లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా ఇతర థర్డ్‌పార్టీ స్టోర్స్, సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు వాటితోపాటుగా ఈ 'గూలిగన్ వైరస్' యూజర్ల డివైస్‌లలోకి వ్యాప్తి చెందుతోంది.ఈ వైరస్వ డివైస్‌లో ఉన్న గూగుల్ అకౌంట్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలు... ఇలా ఒక్కటేమిటి మొత్తం ఫోన్‌లో ఉన్న సమాచారమంతా హ్యాకర్లకు చేరుతుంది.

No comments:
Post a Comment