చెన్నై దగ్గర తుపాను తీరం దాటింది. తీవ్ర రూపం దాల్చి తీరం దాటిన తుపాను క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మరో 24 గంటలపాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురవచ్చని, గాలుల తీవ్రత క్రమంగా తగ్గనుందని వాతావరణశాఖ తెలిపింది.

No comments:
Post a Comment