Tuesday, December 6, 2016

సీఎంగా ప్రమాణస్వీకారం!


జయలలిత , నమ్మినబంటు గా ,వారసుడిగా ఆర్థిక మంత్రి ఓ.పన్నీరు సెల్వం తమిళనాడు 27వ ముఖ్యమంత్రిగా గవర్నర్‌ సమక్షంలో  ప్రమాణస్వీకారం చేసారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఆసుపత్రికి వెళ్లిన పన్నీరు సెల్వం అనంతరం నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. అంతకుముందే అక్కడకు చేరుకున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన భేటి అ య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం పన్నీరు సెల్వం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అర్థరాత్రి దాటాక 1.25 గంటలకు ఆయనతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదివరకు ముందు రెండుసార్లు సెల్వం జయలలిత స్థానంలో  తాత్కాలిక ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

No comments:

Post a Comment