చైనాను భారీ భూకంపం కుదిపేసింది. వాయవ్య జిన్‌జియాంగ్ వైగుర్ అటానమస్ ప్రాంతంలోని హుటుమి కౌంటీలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:15 గంటలకు భూకంపం సంభవించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. ప్రకంపనల దాటికి భవనాలు చిగురుటాకులా వణికాయి. దీంతో పాఠశాలల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించారు. నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. భూకంప కేంద్రం ఉత్తర అంక్షాశానికి 43.83 డిగ్రీలు, తూర్పు అంక్షాంశానికి 86.35 డిగ్రీల వద్ద భూమికి ఆరు కిలోమీటర్ల లోతున ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

No comments:
Post a Comment