తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై కుట్ర జరిగిందని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. జయలలిత ప్రాణస్నేహితురాలు శశికళపై ఆరోపణలు చేస్తూ తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అమ్మ మృతిపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. జయలలిత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని ఆయన తెలిపారు.

No comments:
Post a Comment