Monday, December 19, 2016

ఉరిశిక్ష.. ఆ ఐదుగురు దోషులకు!

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌  21 ఫిబ్రవరి 2013న జరిగిన జంట పేలుళ్ల ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు  ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ  సోమవారం తీర్పునిచ్చింది. ఈ ఐదుగురూ దోషులేనని  నిర్ధారించిన కోర్టు ఇవాళ వీరికి శిక్షలను  ఖరారు చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రియాజ్‌ భత్కల్‌ సహా  మొత్తం ఆరుగురు నిందితులుండగా భత్కల్‌  పరారీలోనే ఉన్నాడు.  మొదటిసారిగా ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థ కేసు భారత దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడింది ఈ నేపథ్యంలో అత్యంత పటిష్ట బందోబస్తు  కోర్టు ఉన్న చర్లపల్లి జైలు వద్ద సోమవారం ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment