Friday, December 9, 2016

రూ.76 లక్షల.. కొత్త రూ.2000 నోట్లు స్వాధీనం!

గుజరాత్‌లో రూ.76 లక్షల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు.మహారాష్ట్రకు చెందిన ఎంహెచ్ 15 ఈపీ 4455 నెంబర్ గల కారును శుక్రవారం సూరత్‌ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో రూ.76 లక్షల విలువైన 3,800 కొత్త రూ.2000 నోట్లు బయటపడ్డాయి. ఈ డబ్బును సచిన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చేందుకు నాసిక్ నుంచి తీసుకొస్తున్నట్లు తేలింది. కారు, డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఓ మహిళతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

No comments:

Post a Comment