టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి వద్ద రూ.90 కోట్లు మరువక ముందే... చెన్నైలో మళ్లీ పెద్ద ఎత్తున సొమ్ము బయటపడింది. ఆదాయపన్నుఅధికారులు శుక్రవారం పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.106 కోట్ల నగదుతో పాటు 127 కేజీల బంగారం పట్టుబడింది. ఇందులో రూ.10 కోట్ల మేర కొత్త నోట్లు కూడా ఉండడం విశేషం. ఒక్కోటి కిలో బరువున్న 127 బంగారపు కడ్డీలు, రూ.96 కోట్ల పాత కరెన్సీ నోట్లు, రూ.10 కోట్ల మేర రూ.2000 కొత్తనోట్లు తమ సోదాల్లో బయటపడినట్టు ఐటీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన కొత్త కరెన్సీకి సంబంధించి కనీసం బ్యాంకు రసీదులు కూడా లేకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Post a Comment