కారుకు దారి ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఓ పోలీస్ అధికారి తుపాకీతో ఇద్దరిపై కాల్పులు జరిపాడు. తాగిన మైకంలో జరిగిన,ఈ ఘటన అసోంలోని గౌహతిలో జరిగింది. బాసిస్టా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్పీ గోలప్ కొన్వార్ బుధవారం రాత్రి తప్ప తాగి ఆల్టో కారులో వెళ్తున్నాడు.అయితే తన వాహనానికి దారి ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఇద్దరు వాహన డ్రైవర్లపై తన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ అధికారిని అదుపులోకి తీసుకుని అతని ఇంటి నుంచి కొన్ని బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏడు మంది యువకులు తనను చుట్టుముట్టడంతో ఆత్మరక్షణకు కాల్పులు జరిపినట్లు ఆ పోలీస్ ఆఫీసర్ చెబుతున్నాడు.

No comments:
Post a Comment