Thursday, December 22, 2016

అత్యంత సన్నని,తక్కువ మందం ల్యాప్‌టాప్‌ విడుదల...!

ప్రపంచంలోనే అత్యంత సన్నదైన,అతి  తక్కువ మందం కలిగిన ల్యాప్‌టాప్‌ను 'ఏసర్' సంస్థ విడుదల చేసింది.ఇప్పటికే ఐఎఫ్‌ఏ 2016 షోలో ఏసర్ ప్రదర్శించగా  'స్విఫ్ట్ 7' పేరిట విడుదలైన  కేవలం 1.2 కేజీల బరువు గల ఈ ల్యాప్‌టాప్‌ను యూజర్లకు  అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.1.09 లక్షలు. ఈ ల్యాప్‌టాప్ లో14 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 8 జీబీ డీడీఆర్3 ర్యామ్, హెచ్‌డీ వెబ్‌క్యామ్ , 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, డాల్బీ ఆడియో,,8 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

No comments:

Post a Comment