Sunday, December 11, 2016

ఇక పనిచేయకుండపోతున్న ఆ ఫోన్లు.....

గెలాక్సీ నోట్‌7 ఫోన్లలోని బ్యాటరీ అధికంగా వేడెక్కి ఫోన్లు పేలిపోతుండటంతో నోట్‌7 ఫోన్లను వెనక్కి తిరిగిచ్చేయాలని సామ్‌సంగ్‌  వినియోగదారులను కోరింది. ఆ ఫోన్లను తిరిగిచ్చిన వారికి మరో మోడల్‌ ఫోన్‌ తీసుకోవడం.. రీఫండ్‌ పొందే అవకాశం కల్పించింది. అయినా ఇప్పటికీ పూర్తిగా రికవరీ కాలేదట. మొత్తం ఫోన్లలో 87శాతం రీకాల్‌ కాగా.. అమెరికాలో 93శాతం అయ్యాయట. ఇప్పుడు వినియోగదారుల వద్దే ఉండిపోయిన ఫోన్లనూ వెనక్కి రప్పించేందుకు సామ్‌సంగ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను పంపించి తిరిగివ్వని నోట్‌7 ఫోన్లను పూర్తిగా పనిచేయకుండా చేయాలని నిర్ణయించింది.

No comments:

Post a Comment