Friday, December 16, 2016

దిల్లీలోదారుణం...

దిల్లీలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌ కారులోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉద్యోగం వెతుక్కునేందుకు దిల్లీకి వచ్చిన యువతి గురువారం రాత్రి ఎయిమ్స్‌ సమీపంలో ఉండగా.. ఓ టాక్సీ డ్రైవర్‌ నోయిడా వరకు లిఫ్ట్‌ ఇస్తానని కారులో ఎక్కించుకొని,  కారును మోతీబాగ్‌ సమీపంలోఆపి ఆమెపై అత్యాచారం చేశాడు.అదే సమయంలో అటువైపుగా పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం రావడంతో  ట్యాక్సీ డ్రైవర్‌ కారును  వదిలి పారిపోయాడు. పోలీసులు యువతిని రక్షించి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కొన్ని గంటల్లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ట్యాక్సీ డ్రైవర్‌ వదిలి వెళ్లిన కారుపై కేంద్ర హోంశాఖ స్టిక్కర్‌ ఉండటంతో  దీనిపై ఆరా తీస్తున్నారు.

No comments:

Post a Comment