పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం నిర్మూలన జరిగితే అప్పుడు తాను కూడా మోదీ.. మోదీ అని భజన చేస్తానని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ఆర్థికవ్యవస్థ నాశనమవుతోందని నోట్ల రద్దు వల్ల కార్మికులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పలువురు ఉపాధి కోల్పోతున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ అభియాన్, యోగా దినోత్సవం, సర్జికల్ స్ట్రైక్స్‌ను స్వాగతించాం. కానీ మోదీ నోట్ల రద్దుపై తీసుకున్న ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’మని పేర్కొన్నారు.

No comments:
Post a Comment