Wednesday, December 7, 2016

ఇస్రో ప్రయోగం విజయవంతం....

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో పీఎస్‌ఎల్వీసిరీస్‌లో 38వ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం ఉదయం పీఎస్‌ఎల్వీ సీ-36 రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ 1235 కేజీల బరువైన రిసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహాన్ని నిర్ణీత వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 17నిమిషాల్లో ప్రయోగం పూర్తి అయ్యింది. పీఎస్‌ఎల్వీ సీ-36 రాకెట్ ద్వారా వెళ్లే రిసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహం రైతులకు ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎంతవరకు దిగుబడి వస్తుంది, వ్యవసాయానికి అనుకూల ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేస్తుంది.

No comments:

Post a Comment