Sunday, January 15, 2017

కోహ్లీ సేన సంచలన విజయం ....

పూణే లో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య  సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో  భారత్ ఇంగ్లండ్‌పై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ ఏడు వికెట్ల నష్టానికి  356 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసి భారత్‌కు 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. .కోహ్లీకి వన్డే కెప్టెన్సీ తీసుకున్న తర్వాత  ఇది తొలి విజయం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  కోహ్లీకి , జాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  రాగా, వీరి భాగస్వామ్యంలో 242 పరుగులు చేశారు. కోహ్లీ 122 పరుగులు(8 ఫోర్లు, 5 సిక్సులు), జాదవ్ 120 పరుగులు(12 ఫోర్లు, 4 సిక్సులు) చేసి ఔటయ్యారు. నాటౌట్‌గా నిలిచిన పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్) చేశాడు. జనవరి 19న  రెండో వన్డే కటక్ వేదికగా జరగనుంది .

Saturday, January 14, 2017

సంక్రాంతి శుభాకాంక్షలు....


 మిత్రులందరికీ    సంక్రాంతి శుభాకాంక్షలు.

కాటమరాయుడు న్యూ లుక్‌...

సంక్రాంతికి కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. కాటమరాయుడు న్యూ లుక్‌ను  ఇవాళ సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్  విడుదల చేసింది. ఈ లుక్‌లో పవన్ కళ్యాణ్ ఎడ్లబండిపై కాలు పెట్టి చేతిలో రుమాలు పట్టుకుని రైతన్న గెటప్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.  ఈ లుక్‌ తో అభిమానులు సందడి చేసుకున్నారు.

ప్రారంభం కానున్న రామ్‌చరణ్‌ , సుకుమార్‌ ల చిత్రం ....

సూపర్‌ హిట్‌లు సాధించిన మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థ.. మహేశతో ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాలను వరుసగా నిర్మించి తన మూడో చిత్రాన్ని రామ్‌చరణ్‌తో కథానాయకుడిగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 30న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ అధినేతలు నవీన యెర్నేని, వై. రవిశంకర్‌, సి.వి. మోహన, ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం  చేస్తారని తెలిపారు. ఇందులో చరణ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన నటించబోతోంది.  రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి నుండి జరపనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. 

Thursday, January 12, 2017

సినీ నటి రంభకు 'సమన్లు'......

సినీ నటి రంభకు వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరుకావాలని బంజారాహిల్స్ పోలీసులు సమన్లు  బుధవారం అందజేశారు.శ్రీనివాసరావు భార్య పల్లవి  వరకట్నం కోసం వేధిస్తున్నారని తన భర్త, రంభ, మామ వెంకటేశ్వరరావు, అత్త ఉషారాణిలపై కోర్టును ఆశ్రయించారు.  2014 జూలైలో ఐపీసీ 498(ఏ) తోపాటు వరకట్న నిరోధక చట్టం కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  మూడు నెలల క్రితం న్యాయస్థానం  లో హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.  విదేశాల్లో ఉన్న రంభకు అప్పుడు సమన్లు అందలేదు గనుక మరోసారి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.





Tuesday, January 10, 2017

సౌరవ్ గంగూలీని చంపేస్తామంటూ లేఖ......

విద్యాసాగర్ విశ్వవిద్యాలయంలో జరిగే ఇంటర్‌కాలేజీ క్రికె ట్ టోర్నీకి జనవరి  19న మిడ్నాపూర్‌లో భారతమాజీ క్రికెట్ కెప్టెన్ గంగూలీ ముఖ్య అతిథిగా హాజరైతే చంపేస్తామంటూ ఆలమ్ అనే వ్యక్తి గంగూలీ తల్లి నిరూపకు  బెదిరింపు లేఖ రాశాడు. ఈ విషయాన్ని గంగూలీ కూడా ధృవీకరించాడు.ఒకవేళ ధైర్యం చేసి వస్తే మీ కుమారుడిని మీరు చూడలేరు అంటూ ఆ లేఖలో  తల్లి నిరూప ను హెచ్చరించారు. ఈ విషయాన్ని  టోర్నీ నిర్వాహకులు,పోలీస్ ల దృష్టికి తీసుకెళ్లాను అని,ఈ బెదిరింపుల నేపథ్యంలో టోర్నీలో పాల్గొనాలా వద్దా అన్నదానిపై  ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపారు.

Monday, January 9, 2017

స్వైపింగ్‌ అమ్మకాల నిలుపుదల వాయిదా.....పెట్రోల్ బంకుల యజమానులు!

పెట్రోల్‌ బంకుల్లో స్వైపింగ్‌ ద్వారా అమ్మకాల నిలుపుదల నిర్ణయం వాయిదా వేస్తున్నట్లు పెట్రోల్ బంకుల యజమానులు తెలిపారు.దీనికి కారణం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ హామీతో ఈ నిర్ణయం నెల 13 వరకు  వాయిదా వేసినట్లు వారు తెలిపారు,అయితే..  బంకు యజమానుల  ఆర్బీఐ 1 శాతం పన్ను విధింపుపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.

Sunday, January 8, 2017

కార్డ్ లు బంద్ చేయనున్న పెట్రోల్ బoక్....

రేపటినుండి  దేశ‌వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను అంగీక‌రించ‌కూడ‌ద‌ని పెట్రోలియం ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్ నిర్ణ‌యించింది.  దీనికి కార‌ణం, కార్డు ద్వారా జ‌రిపే ప్ర‌తి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం చార్జీ వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించ‌డ‌మే .ఈ కొత్త చార్జీలు పెట్రోల్ బంకుల యాజ‌మాన్యాలు భారం మోయడంతో , నిర‌స‌న‌గా సోమ‌వారం నుంచి కార్డుల‌ను అంగీక‌రించ‌డం లేద‌ని, కేవ‌లం న‌గ‌దునే అంగీక‌రిస్తామ‌ని అఖిల క‌ర్ణాట‌క ఫెడ‌రేష‌న్ ఆఫ్ పెట్రోలియ‌మ్ అధ్య‌క్షుడు బీఆర్ ర‌వీంద్ర‌నాథ్ స్ప‌ష్టంచేశారు.

Saturday, January 7, 2017

నాకేమిస్తావన్న ప్రముఖ నటుడు-హీరోయిన్‌ అర్చన

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం అనేది చాలా కామన్‌ అని,ఈ విషయాన్నిసినీ పరిశ్రమ ఖండించినా.. అది నిజమే అని అందరూ చెబుతారు.ఈ విషయాన్ని తాజాగా హీరోయిన్‌ అర్చన కూడా   ధ్రువీకరించింది. ఓ ప్రముఖ నటుడు తనకు  సినిమాలో అవకాశo ఇప్పించానని,నాకు ఏమిస్తావని అడిగాడని చెప్పింది అర్చన. అలాగే ఓ ప్రముఖ హీరో తనతో కలిసి వేదిక వద్దకు రావడానికి ఇష్టపడలేదని,అంతేకాకుండా‘కమలతో నా ప్రయాణం’ మూవీ ప్రమోషన్‌ కోసం తను అడిగిన సినీ పెద్దలు  చిన్న సహాయం కూడా చేసేందుకు  అంగీకరించలేదని తెలిపింది.

మొట్టమొదటి వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ 'ల్యాప్‌టాప్‌'...

ప్రపంచంలో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో వస్తున్న ల్యాప్‌టాప్‌  ‘లాటిట్యూడ్‌ 7285’ని ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ డెల్‌ తొలి నోట్‌బుక్‌ కంప్యూటర్‌ను రూపొందించిందని  పేర్కొంది.ఈ కంప్యూటర్‌ను లాస్‌వెగాస్‌లో జరుగుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్‌ ప్రదర్శన (సీఈఎస్‌-2017)లో కంపెనీ ఆవిష్కరించింది. డెల్‌ కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌కు ‘వైట్రిసిటీ’ మాగ్నెటిక్‌ రిజోనెన్స్‌ సిస్టమ్‌’ ఆధారంగా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయాన్ని అనుసంధానించింది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌కు ల్యాప్‌టాప్‌ తాకించగానే ఛార్జింగ్‌ అవుతుంది.వైట్రిసిటీ సీఈవో అలెక్స్‌ గ్రుజోన్‌ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ‘డెల్‌’, ‘వైట్రిసిటీ’ కంపెనీలు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు  తెలిపారు.

బాలివుడ్ ప్రముఖ నటుడు 'ఓంపురి' కన్నుమూత!

ఓంపురి గురువారం సాయంత్రం  రాంభజన్ జిందాబాద్ సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరారు. తాను శుక్రవారం ఉదయం ఇంట్లోకి వెళ్లేసరికి ఓంపురి  కిచెన్‌లో  నేలమీద నిర్జీవం గా పడిఉన్నారని నందిత చెప్పారు. పోస్టుమార్టం కోసం ఓంపురి భౌతికకాయాన్నిఆసుపత్రికు తరలించి అనంతరం ముంబై శివారులోని ఆయన నివాసగృహానికి తీసుకొచ్చారు.అనుపమ్‌ఖేర్, అశోక్‌పండిట్ ప్రకాశ్ ఝా, షబానాఆజ్మీ,తదితర బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు ఓషివారా విద్యుత్ దహనవాటికలో సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. హర్యానారాష్ట్రం లోని అంబాలాలో జన్మించిన ఓంపురి ది వంగత నటుడు అమ్రిష్‌పూరికి స్వయాన తమ్ముడు.

విమానాశ్రయంలో కాల్పులు..

శుక్రవారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఫోర్ట్ లాడెర్‌డేల్-హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) విచక్షణారహితంగా ఓ దుండుగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, కనీసం 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారని,అతడితోపాటు ఇతరులు పాల్గొన్నట్లు తాము భావించటం లేదని తెలిపారు.

కేసిఆర్ ను కలసిన సినీ హీరో బాలకృష్ణ...

సినీ హీరో బాలకృష్ణ శుక్రవారం చారిత్రక నేపథ్యంలో నిర్మించిన గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వాలని  ప్రగతిభవన్‌లో  సీఎం కేసీఆర్‌ను  కోరారు, వారు సానుకూలత వ్యక్తం చేసి  వెంటనే పన్ను మినహాయింపు ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక వ్యక్తులు,వాటి నేపథ్యమున్న చిత్రాల ఇతివృత్తంతో తీసిన సినిమాలను ప్రోత్సహించేందుకు  తగిన సహకారం తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. గతంలో రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చామని ఈ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని   సీఎం స్పష్టం చేశారు.


Saturday, December 31, 2016

సెంట్రల్ బాగ్దాద్‌లో పేలుళ్లు!

ఇరాక్ రాజధాని  సెంట్రల్ బాగ్దాద్‌లో  అల్ సినాక్  మార్కెట్‌లో పేలుళ్లు జరిగినట్టు అధికారులు తెలిపారు. రెండు చోట్ల జరిగిన బాంబు పేలుడు దుర్ఘటనలో 21 మంది మృతిచెందారు,45 మంది గాయపడ్డారు.క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.ఇప్పటి వరకు పేలుళ్లుకు సంబంధించి తామే భాధ్యత అంటూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. ఇటీవల బాగ్ధాద్ లో మిలిటెంట్ల బహిరంగ ప్రదేశాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారు.


Friday, December 30, 2016

జనవరి 30వరకు శంషాబాద్‌ లో ఆంక్షలు!

శంషాబాద్‌ విమానా శ్రయంలోగణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రతా చర్యల్లో జనవరి 30 వరకు ఆంక్షలును బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే విజిటర్స్‌కు అనుమతి లేదు,అంతేకాక గురువారం దీనికి సంబంధించిన టికెట్ల జారీని నిలిపివేశారు. ప్రయాణికులను కారు పార్కింగ్‌ వరకు అదికూడా స్వాగతం, వీడ్కోలు పలికేవారిని మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణికులు సకాలంలో చేరుకుని సహకరించాలని అధికారులు లు కోరారు.

Thursday, December 29, 2016

ప్రధాన కార్యదర్శిగా' చిన్నమ్మ' శశికళ!

అన్నాడిఎo కే పార్టీ  ప్రధాన కార్యదర్శిగా' శశికళ నటరాజన్ ను ఎన్నుకున్నారు.ఈరోజు పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరయ్యారు.దివంగత మాజీ సిఎo జయలలితకు సంతాపం తెలిపి 14 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.శశికళ నాయకత్వంలోపనిచేయాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రధాన కార్యదర్శిగా' ఎన్నుకున్నారు.జయలలిత పుట్టినరోజు ను రైతుల దినోత్సవంగా ప్రకటించిన తీర్మానాన్ని ఆమోదించారు.



కోహ్లి,అనుష్క‌శర్మ ల నిశ్చితార్థం!

టీమిండియా కెప్టెన్ కోహ్లి, బాలీవుడ్ నటీ అనుష్క‌శర్మ త‌మ ల‌వ్‌స్టోరీకి ఇక ఫుల్‌స్టాప్ పెట్ట‌నున్నారు.ఈ ఇద్ద‌రూ ఎంగేజ్‌మెంట్‌కి జనవరి 1 న్యూ ఇయ‌ర్ డే నాడే సిద్ధ‌మ‌వుతున్నట్లు స‌మాచారం.ఈ ఇద్ద‌రికి ఉత్త‌రాఖండ్‌లోని న‌రేంద్ర‌న‌గ‌ర్ ఆనందా హోటల్‌లో ఎంగేజ్‌మెంట్‌ జ‌రిగే అవకాశం ఉంది.ఈ ప్రేమ‌జంట ఉత్త‌రాఖండ్ కి క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ కోసం  వెళ్లిన విష‌యం తెలిసిందే.  ఈ ఇద్ద‌రూ అక్క‌డి నుంచే  ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ పోస్ట్‌లు చేస్తున్నారు. 

బంపర్ ఆఫర్......అమెజాన్ !

ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్  వినియోగదారలను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు వస్తువులను ఈ వెబ్‌సైట్‌లో కొనుగోళ్లు చేసేవారు,కానీ ఇప్పటి నుంచి అమ్మకాలు కూడా  ఓఎల్‌ఎక్స్, క్విక్కర్ వంటి ప్రత్యేక వెబ్‌సైట్లు చేసే విధంగా  అమెజాన్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది.

వస్తువును అమ్మాల్సిన విధానం...
మీరు వస్తువు అమ్మకానికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఆ వస్తువును అమ్మకానికి పెట్టినప్పుడు ఎవరైనా ఆర్డర్ చేస్తే, అమెజాన్ సిబ్బంది మీ వద్దకు వచ్చి వస్తువును ప్యాకింగ్ చేసి,డెలివరీ ఆర్డర్ చేసుకున్న అడ్రస్‌కు  చేరవేస్తారు. ఇలా చేయడం వల్ల మీ వస్తువును అమ్మినందుకు సంస్థ, వచ్చిన మొత్తం నుంచి కొంత తీసుకుంటుంది. అది ఎలాగంటే మీరు అమ్మిన వస్తువు ధర రూ. 1000 లోపు ఉంటే 10 రూపాయలు తీసుకోగా రూ. 1000 నుండి రూ. 5000 మధ్యలో ఉంటే 50 రూపాయలు, రూ. 5000ఆ పైన ఉంటే 100 రూపాయలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి బెంగుళూరులో మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. త్వరలో సంస్థ ప్రతినిధులు ఈవిధానం ను  అన్ని నగరాల్లో ఏర్పాటు చేస్తామని  వెల్లడించారు.

జయ మృతిపై అవసరమైతే రీ- పోస్ట్ మార్టం...మద్రాస్ హైకోర్ట్!

జయలలిత మృతిపై  సందేహాలున్నాయని  అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యనాథన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులో దాఖలైన పిల్‌పై జస్టిస్‌ వైద్యనాథన్‌, జస్టిస్‌ పార్తిబన్‌ ధర్మాసనం విచారణ సందర్భంగా,జయ కు ఎలాంటి చికిత్స అందిందో కేంద్రానికి తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉందో తెలియదని ఆయన చెప్పారు. జనవరి 9లోగా జయ మృతిపై  సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు, నోటీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని  తీవ్రంగా మందలించారు. జస్టిస్ వైద్యనాథన్ తాను ఒక్కడినే ఈ పిటిషన్లను విచారించాల్సి వస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుందని వ్యాఖ్యానించడం విశేషం.

Wednesday, December 28, 2016

ఖైదీ నంబర్ 150’ మూడో పాట విడుదల...

  
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ నుంచి  విడుదలైన రెండు పాటలుఇప్పటికే చిరు అభిమానుల్లో మంచి జోష్ నింపుతున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్‌లో మార్కెట్‌లోకి వచ్చిన రెండు పాటలు  తాజాగా చిరు క్రేజీ ప్రాజెక్టు నుంచి మూడో పాటను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది. ‘సాయం కాలాన..సాగర తీరాన అంటూ సాగే ఈ పాటను హరిహరన్, శ్రేయా ఘోషల్ పాడారు. సంక్రాంతికి థియేటర్లలో సందడిచేయనున్న వినాయక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

ఢిల్లీ కి కొత్త గవర్నర్.....

ఢిల్లీ కి కేంద్ర మాజీ హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనిల్ బైజాల్‌ను గవర్నర్‌గా నియమించారు.  బైజాల్ 1969 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.  నజీబ్ జంగ్ ఈ నెల 22న రాజీనామా చేశాక, ఇవాళ ఆయన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదించారు. ఆ వెంటనే బైజాల్‌‌ను ఢిల్లీ కి కొత్త గవర్నర్‌గా నియమించారు.ప్రస్తుతం బైజాల్  స్వామి వివేకానంద థింక్ ట్యాంక్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నారు.

సడలించబోతున్నన విత్ డ్రా పరిమితి !

ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్ పై ప్రజలనుద్దేశించి  డిసెంబర్ 30న ప్రసంగించనున్నారు. ఇందులో మోదీ బ్యాంకులు నుంచి నగదు పరిమితి ఏటీఎం విత్ డ్రాలను సడలించనున్నారని ప్రస్తుతం నిబంధనల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రధాని ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న రోజుకు రూ.2,500, వారానికి రూ.24,000 పరిమితిని సడలించి, రోజుకు రూ.4000, వారానికి రూ.40,000 తీసుకునేలా ప్రకటన ఉండబోతున్నదని  విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు ద్రవ్య పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి తనకు 50 రోజులు గడువు కావాలని అలాగే  నగదు కొరత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 22న కొత్త రూ.500, రూ.2000 నోట్ల ప్రింటింగ్ కు టెండర్లు వేయనున్నారని తెలుస్తోంది. 

Saturday, December 24, 2016

లిబియా హైజాకర్లు లొంగుబాటు...

విమానాన్ని హైజాక్ చేసిన  వారిని అదుపులోకి తీసుకున్నామని మాల్టా ప్రధాని జోసఫ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ హైజాకర్లు లిబియా మాజీ నియంత గడాఫీ మద్దతుదార్లని,వారి  రాజకీయ పార్టీని స్థాపించాలనే లక్ష్యంతో ఉన్నారని తెలిపారు. మాల్టా ప్రధాని జోసఫ్, మాల్టాలో రాజకీయ ఆశ్రయాన్ని వారు కోరుకుంటున్నారని,అయితే,హైజాకర్లు రాజకీయ ఆశ్రయాన్ని కోరలేదని వెల్లడించారు. వారి నుండి ఒక గ్రెనేడ్, రెండు పిస్టళ్లు దొరికాయని తెలిపారు.

డేట్ ఫిక్స్ అయిన 'కాటమరాయుడు'..

పవర్‌స్టార్ పవన్ కాళ్యాణ్ అందాల తార శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కిషోర్‌కుమార్ పార్థసారధి శర వేగంగా తీస్తున్నారు అభిమానులు, సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తోంది.షూటింగ్ అనుకున్నవిధంగా జరిగితే  వచ్చే ఏడాది మార్చిలో ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలాచిలో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి  అనూప్ రూబెన్స్ సంగీతం ఇస్తున్నారు.  కిషోర్‌కుమార్ పార్థసారధి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. 

ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని రద్దు చేసిన ఎన్నికల సంఘం....

కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా‌లకు చెందిన 12 పార్టీలను రద్దు చేస్తున్నట్లు  ప్రకటించింది వీటిలో లక్ష్మీపార్వతి ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ తెలుగు దేశం, ఇంద్రారెడ్డి ఏర్పాటు చేసిన జై తెలంగాణ పార్టీ  నటుడు హరికృష్ణ ఏర్పాటు చేసిన అన్న తెలుగు దేశం కూడా ఉన్నాయి. ఆంధ్రనాడు పార్టీ, అన్న తెలుగుదేశం పార్టీ, ముదిరాజ్‌ రాష్ట్రీ‌య సమితి,బహుజన రిపబ్లికన పార్టీ, భారతీయ సేవాదళ్‌, జై తెలంగాణ పార్టీ,  నేషనల్‌ సిటిజెన్స్ పార్టీ, ఎనటీఆర్‌ తెలుగుదేశం పార్టీ (లక్ష్మీపార్వతి), సత్యయుగ్‌ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ.

Friday, December 23, 2016

విమానంను పేల్చివేస్తామంటున్న హైజాకార్లు....

లిబియా  ప్రభుత్వ రంగ సంస్థ ఆఫ్రికియా ఎయిర్  వేస్ కు చెందిన  ఎయిర్ బస్ 320 , 111మంది  ప్రయాణికులు ఏడుగురు సిబ్బందితో బయలుదేరిన విమానాన్ని శుక్రవారం దుండగులు హైజాక్ చేశారు.భద్రతాదళాలు అత్యవవసర చర్యలు చేపట్టినట్లు తెలిపారు . మాల్టీస్ మీడియా ఎయిర్ బస్ 320ని దారి మళ్లించి మాల్టా లో  ల్యాండ్ చేసినట్టు,  హైజాకర్లు  విమానాన్ని పేల్చివేస్తామని  బెదిరిస్తున్నట్టు తెలిపింది.హైజాకర్లు నైరుతీ లిబియా సబా నుంచి ట్రిపోలీ వెళుతుండగా దారి మళ్లించారు. దీంతో మాల్టా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్  ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని విమానాలను రద్దుచేసీ,మరికొన్నింటిని దారి మళ్లించారు.మరోవైపు మాల్టీస్ ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ కూడా  హైజాక్  విషయాన్ని ట్విట్టర్ ద్వారా దృవీకరించారు. దుండగుల వివరాలు,  డిమాండ్లు ఇతర అంశాలు ఇంకా తెలియాల్సి వుంది.

'వంగవీటి' కి భారీబందో బస్త్....

వంగవీటి చిత్రం ,వంగవీటి రంగా, దేవినేని నెహ్రూల మధ్య జరిగిన గొడవల నేపధ్యంలో తెరకెక్కడంతో రంగా అభిమానులు ఇటు దేవినేని అభిమానులు థియేటర్ల దగ్గర హల్ చల్ చేయడంతో ఏ సినిమాకు ఏర్పాటు చేయనంత బందోబస్త్  శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఏపీ లోని పలు జిల్లాలలో పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాటు చేసినట్టు టాక్. 1970-80లో విజయవాడ నేపథ్యంలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో  వర్మ వంగవీటి సినిమాలో ఎవరిని ఎలా చూపించాడు, ఏ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది అనే అంశం పై మరి కొద్ది నిమిషాలలో క్లారిటీ రానుండగా, అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

ఆ ఉగ్రవాదిని హతమార్చిన పోలీసులు....

జర్మనీ రాజధాని బెర్లిన్‌ నగరంలో ట్రక్కుతో దాడి చేసిన ఘటనలో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు శుక్రవారం ఇటలీలో ఉత్తరాదిన ఉన్న మిలాన్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో మరణించినట్టు భద్రతాదళ అధికారులు చెప్పారు. నిదితుడు ట్యునీసియాకు చెందిన 24 ఏళ్ల అనిస్‌ అమ్రిగా పోలీసులు భావిస్తున్నారు.పోలీసులు ఇటలీ మేగజైన్‌ పనోరమ వెబ్‌ సైట్‌లో కాల్పుల ఘటనకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. తమ సైనికుడే  ఈ దాడికి పాల్పడింది అని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది 


Thursday, December 22, 2016

భారీ అగ్ని ప్రమాదంలో 140 ఇళ్లు...!

జపాన్ కోస్తా తీరంలోని ఇటోయిగావాలో ఈ ఉదయం  ఓ రెస్టారెంట్‌లో ప్రమాదవశాత్తు మంటలు  ఎగసిపడి  ఈదురు గాలుల దాటికి చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించడంతో మొత్తం తక్కువలో తక్కువగా 140 ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయని,గంటకు 56 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో  చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించినట్టు జపాన్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ప్రజలను సమీపంలోని ఇళ్ల నుంచి అధికారులు  సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రమాదం కి గల కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అత్యంత సన్నని,తక్కువ మందం ల్యాప్‌టాప్‌ విడుదల...!

ప్రపంచంలోనే అత్యంత సన్నదైన,అతి  తక్కువ మందం కలిగిన ల్యాప్‌టాప్‌ను 'ఏసర్' సంస్థ విడుదల చేసింది.ఇప్పటికే ఐఎఫ్‌ఏ 2016 షోలో ఏసర్ ప్రదర్శించగా  'స్విఫ్ట్ 7' పేరిట విడుదలైన  కేవలం 1.2 కేజీల బరువు గల ఈ ల్యాప్‌టాప్‌ను యూజర్లకు  అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.1.09 లక్షలు. ఈ ల్యాప్‌టాప్ లో14 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 8 జీబీ డీడీఆర్3 ర్యామ్, హెచ్‌డీ వెబ్‌క్యామ్ , 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, డాల్బీ ఆడియో,,8 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.