Tuesday, January 10, 2017

సౌరవ్ గంగూలీని చంపేస్తామంటూ లేఖ......

విద్యాసాగర్ విశ్వవిద్యాలయంలో జరిగే ఇంటర్‌కాలేజీ క్రికె ట్ టోర్నీకి జనవరి  19న మిడ్నాపూర్‌లో భారతమాజీ క్రికెట్ కెప్టెన్ గంగూలీ ముఖ్య అతిథిగా హాజరైతే చంపేస్తామంటూ ఆలమ్ అనే వ్యక్తి గంగూలీ తల్లి నిరూపకు  బెదిరింపు లేఖ రాశాడు. ఈ విషయాన్ని గంగూలీ కూడా ధృవీకరించాడు.ఒకవేళ ధైర్యం చేసి వస్తే మీ కుమారుడిని మీరు చూడలేరు అంటూ ఆ లేఖలో  తల్లి నిరూప ను హెచ్చరించారు. ఈ విషయాన్ని  టోర్నీ నిర్వాహకులు,పోలీస్ ల దృష్టికి తీసుకెళ్లాను అని,ఈ బెదిరింపుల నేపథ్యంలో టోర్నీలో పాల్గొనాలా వద్దా అన్నదానిపై  ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపారు.

No comments:

Post a Comment