సినీ హీరో బాలకృష్ణ శుక్రవారం చారిత్రక నేపథ్యంలో నిర్మించిన గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కోరారు, వారు సానుకూలత వ్యక్తం చేసి వెంటనే పన్ను మినహాయింపు ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక వ్యక్తులు,వాటి నేపథ్యమున్న చిత్రాల ఇతివృత్తంతో తీసిన సినిమాలను ప్రోత్సహించేందుకు తగిన సహకారం తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. గతంలో రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చామని ఈ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.

No comments:
Post a Comment