సినీ నటి రంభకు వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరుకావాలని బంజారాహిల్స్ పోలీసులు సమన్లు బుధవారం అందజేశారు.శ్రీనివాసరావు భార్య పల్లవి వరకట్నం కోసం వేధిస్తున్నారని తన భర్త, రంభ, మామ వెంకటేశ్వరరావు, అత్త ఉషారాణిలపై కోర్టును ఆశ్రయించారు. 2014 జూలైలో ఐపీసీ 498(ఏ) తోపాటు వరకట్న నిరోధక చట్టం కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు నెలల క్రితం న్యాయస్థానం లో హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న రంభకు అప్పుడు సమన్లు అందలేదు గనుక మరోసారి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

No comments:
Post a Comment