Sunday, January 15, 2017

కోహ్లీ సేన సంచలన విజయం ....

పూణే లో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య  సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో  భారత్ ఇంగ్లండ్‌పై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ ఏడు వికెట్ల నష్టానికి  356 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసి భారత్‌కు 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. .కోహ్లీకి వన్డే కెప్టెన్సీ తీసుకున్న తర్వాత  ఇది తొలి విజయం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  కోహ్లీకి , జాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  రాగా, వీరి భాగస్వామ్యంలో 242 పరుగులు చేశారు. కోహ్లీ 122 పరుగులు(8 ఫోర్లు, 5 సిక్సులు), జాదవ్ 120 పరుగులు(12 ఫోర్లు, 4 సిక్సులు) చేసి ఔటయ్యారు. నాటౌట్‌గా నిలిచిన పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్) చేశాడు. జనవరి 19న  రెండో వన్డే కటక్ వేదికగా జరగనుంది .

Saturday, January 14, 2017

సంక్రాంతి శుభాకాంక్షలు....


 మిత్రులందరికీ    సంక్రాంతి శుభాకాంక్షలు.

కాటమరాయుడు న్యూ లుక్‌...

సంక్రాంతికి కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. కాటమరాయుడు న్యూ లుక్‌ను  ఇవాళ సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్  విడుదల చేసింది. ఈ లుక్‌లో పవన్ కళ్యాణ్ ఎడ్లబండిపై కాలు పెట్టి చేతిలో రుమాలు పట్టుకుని రైతన్న గెటప్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.  ఈ లుక్‌ తో అభిమానులు సందడి చేసుకున్నారు.

ప్రారంభం కానున్న రామ్‌చరణ్‌ , సుకుమార్‌ ల చిత్రం ....

సూపర్‌ హిట్‌లు సాధించిన మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థ.. మహేశతో ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాలను వరుసగా నిర్మించి తన మూడో చిత్రాన్ని రామ్‌చరణ్‌తో కథానాయకుడిగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 30న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ అధినేతలు నవీన యెర్నేని, వై. రవిశంకర్‌, సి.వి. మోహన, ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం  చేస్తారని తెలిపారు. ఇందులో చరణ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన నటించబోతోంది.  రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి నుండి జరపనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. 

Thursday, January 12, 2017

సినీ నటి రంభకు 'సమన్లు'......

సినీ నటి రంభకు వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరుకావాలని బంజారాహిల్స్ పోలీసులు సమన్లు  బుధవారం అందజేశారు.శ్రీనివాసరావు భార్య పల్లవి  వరకట్నం కోసం వేధిస్తున్నారని తన భర్త, రంభ, మామ వెంకటేశ్వరరావు, అత్త ఉషారాణిలపై కోర్టును ఆశ్రయించారు.  2014 జూలైలో ఐపీసీ 498(ఏ) తోపాటు వరకట్న నిరోధక చట్టం కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  మూడు నెలల క్రితం న్యాయస్థానం  లో హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.  విదేశాల్లో ఉన్న రంభకు అప్పుడు సమన్లు అందలేదు గనుక మరోసారి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.





Tuesday, January 10, 2017

సౌరవ్ గంగూలీని చంపేస్తామంటూ లేఖ......

విద్యాసాగర్ విశ్వవిద్యాలయంలో జరిగే ఇంటర్‌కాలేజీ క్రికె ట్ టోర్నీకి జనవరి  19న మిడ్నాపూర్‌లో భారతమాజీ క్రికెట్ కెప్టెన్ గంగూలీ ముఖ్య అతిథిగా హాజరైతే చంపేస్తామంటూ ఆలమ్ అనే వ్యక్తి గంగూలీ తల్లి నిరూపకు  బెదిరింపు లేఖ రాశాడు. ఈ విషయాన్ని గంగూలీ కూడా ధృవీకరించాడు.ఒకవేళ ధైర్యం చేసి వస్తే మీ కుమారుడిని మీరు చూడలేరు అంటూ ఆ లేఖలో  తల్లి నిరూప ను హెచ్చరించారు. ఈ విషయాన్ని  టోర్నీ నిర్వాహకులు,పోలీస్ ల దృష్టికి తీసుకెళ్లాను అని,ఈ బెదిరింపుల నేపథ్యంలో టోర్నీలో పాల్గొనాలా వద్దా అన్నదానిపై  ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపారు.

Monday, January 9, 2017

స్వైపింగ్‌ అమ్మకాల నిలుపుదల వాయిదా.....పెట్రోల్ బంకుల యజమానులు!

పెట్రోల్‌ బంకుల్లో స్వైపింగ్‌ ద్వారా అమ్మకాల నిలుపుదల నిర్ణయం వాయిదా వేస్తున్నట్లు పెట్రోల్ బంకుల యజమానులు తెలిపారు.దీనికి కారణం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ హామీతో ఈ నిర్ణయం నెల 13 వరకు  వాయిదా వేసినట్లు వారు తెలిపారు,అయితే..  బంకు యజమానుల  ఆర్బీఐ 1 శాతం పన్ను విధింపుపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.

Sunday, January 8, 2017

కార్డ్ లు బంద్ చేయనున్న పెట్రోల్ బoక్....

రేపటినుండి  దేశ‌వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను అంగీక‌రించ‌కూడ‌ద‌ని పెట్రోలియం ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్ నిర్ణ‌యించింది.  దీనికి కార‌ణం, కార్డు ద్వారా జ‌రిపే ప్ర‌తి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం చార్జీ వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించ‌డ‌మే .ఈ కొత్త చార్జీలు పెట్రోల్ బంకుల యాజ‌మాన్యాలు భారం మోయడంతో , నిర‌స‌న‌గా సోమ‌వారం నుంచి కార్డుల‌ను అంగీక‌రించ‌డం లేద‌ని, కేవ‌లం న‌గ‌దునే అంగీక‌రిస్తామ‌ని అఖిల క‌ర్ణాట‌క ఫెడ‌రేష‌న్ ఆఫ్ పెట్రోలియ‌మ్ అధ్య‌క్షుడు బీఆర్ ర‌వీంద్ర‌నాథ్ స్ప‌ష్టంచేశారు.

Saturday, January 7, 2017

నాకేమిస్తావన్న ప్రముఖ నటుడు-హీరోయిన్‌ అర్చన

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం అనేది చాలా కామన్‌ అని,ఈ విషయాన్నిసినీ పరిశ్రమ ఖండించినా.. అది నిజమే అని అందరూ చెబుతారు.ఈ విషయాన్ని తాజాగా హీరోయిన్‌ అర్చన కూడా   ధ్రువీకరించింది. ఓ ప్రముఖ నటుడు తనకు  సినిమాలో అవకాశo ఇప్పించానని,నాకు ఏమిస్తావని అడిగాడని చెప్పింది అర్చన. అలాగే ఓ ప్రముఖ హీరో తనతో కలిసి వేదిక వద్దకు రావడానికి ఇష్టపడలేదని,అంతేకాకుండా‘కమలతో నా ప్రయాణం’ మూవీ ప్రమోషన్‌ కోసం తను అడిగిన సినీ పెద్దలు  చిన్న సహాయం కూడా చేసేందుకు  అంగీకరించలేదని తెలిపింది.

మొట్టమొదటి వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ 'ల్యాప్‌టాప్‌'...

ప్రపంచంలో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో వస్తున్న ల్యాప్‌టాప్‌  ‘లాటిట్యూడ్‌ 7285’ని ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ డెల్‌ తొలి నోట్‌బుక్‌ కంప్యూటర్‌ను రూపొందించిందని  పేర్కొంది.ఈ కంప్యూటర్‌ను లాస్‌వెగాస్‌లో జరుగుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్‌ ప్రదర్శన (సీఈఎస్‌-2017)లో కంపెనీ ఆవిష్కరించింది. డెల్‌ కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌కు ‘వైట్రిసిటీ’ మాగ్నెటిక్‌ రిజోనెన్స్‌ సిస్టమ్‌’ ఆధారంగా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయాన్ని అనుసంధానించింది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌కు ల్యాప్‌టాప్‌ తాకించగానే ఛార్జింగ్‌ అవుతుంది.వైట్రిసిటీ సీఈవో అలెక్స్‌ గ్రుజోన్‌ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ‘డెల్‌’, ‘వైట్రిసిటీ’ కంపెనీలు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు  తెలిపారు.

బాలివుడ్ ప్రముఖ నటుడు 'ఓంపురి' కన్నుమూత!

ఓంపురి గురువారం సాయంత్రం  రాంభజన్ జిందాబాద్ సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరారు. తాను శుక్రవారం ఉదయం ఇంట్లోకి వెళ్లేసరికి ఓంపురి  కిచెన్‌లో  నేలమీద నిర్జీవం గా పడిఉన్నారని నందిత చెప్పారు. పోస్టుమార్టం కోసం ఓంపురి భౌతికకాయాన్నిఆసుపత్రికు తరలించి అనంతరం ముంబై శివారులోని ఆయన నివాసగృహానికి తీసుకొచ్చారు.అనుపమ్‌ఖేర్, అశోక్‌పండిట్ ప్రకాశ్ ఝా, షబానాఆజ్మీ,తదితర బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు ఓషివారా విద్యుత్ దహనవాటికలో సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. హర్యానారాష్ట్రం లోని అంబాలాలో జన్మించిన ఓంపురి ది వంగత నటుడు అమ్రిష్‌పూరికి స్వయాన తమ్ముడు.

విమానాశ్రయంలో కాల్పులు..

శుక్రవారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఫోర్ట్ లాడెర్‌డేల్-హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) విచక్షణారహితంగా ఓ దుండుగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, కనీసం 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారని,అతడితోపాటు ఇతరులు పాల్గొన్నట్లు తాము భావించటం లేదని తెలిపారు.

కేసిఆర్ ను కలసిన సినీ హీరో బాలకృష్ణ...

సినీ హీరో బాలకృష్ణ శుక్రవారం చారిత్రక నేపథ్యంలో నిర్మించిన గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వాలని  ప్రగతిభవన్‌లో  సీఎం కేసీఆర్‌ను  కోరారు, వారు సానుకూలత వ్యక్తం చేసి  వెంటనే పన్ను మినహాయింపు ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక వ్యక్తులు,వాటి నేపథ్యమున్న చిత్రాల ఇతివృత్తంతో తీసిన సినిమాలను ప్రోత్సహించేందుకు  తగిన సహకారం తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. గతంలో రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చామని ఈ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని   సీఎం స్పష్టం చేశారు.


Saturday, December 31, 2016

సెంట్రల్ బాగ్దాద్‌లో పేలుళ్లు!

ఇరాక్ రాజధాని  సెంట్రల్ బాగ్దాద్‌లో  అల్ సినాక్  మార్కెట్‌లో పేలుళ్లు జరిగినట్టు అధికారులు తెలిపారు. రెండు చోట్ల జరిగిన బాంబు పేలుడు దుర్ఘటనలో 21 మంది మృతిచెందారు,45 మంది గాయపడ్డారు.క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.ఇప్పటి వరకు పేలుళ్లుకు సంబంధించి తామే భాధ్యత అంటూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. ఇటీవల బాగ్ధాద్ లో మిలిటెంట్ల బహిరంగ ప్రదేశాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారు.


Friday, December 30, 2016

జనవరి 30వరకు శంషాబాద్‌ లో ఆంక్షలు!

శంషాబాద్‌ విమానా శ్రయంలోగణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రతా చర్యల్లో జనవరి 30 వరకు ఆంక్షలును బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే విజిటర్స్‌కు అనుమతి లేదు,అంతేకాక గురువారం దీనికి సంబంధించిన టికెట్ల జారీని నిలిపివేశారు. ప్రయాణికులను కారు పార్కింగ్‌ వరకు అదికూడా స్వాగతం, వీడ్కోలు పలికేవారిని మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణికులు సకాలంలో చేరుకుని సహకరించాలని అధికారులు లు కోరారు.